ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ (ఫాగ్) తెలుగు అసోషియేషన్ వారు ఫ్రీమౌంట్ దేవాలయం ప్రాంగణంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫాగ్ తెలుగు చైర్ పర్సన్ జోశర్మ (జ్యోత్స్న), ఫాగ్ తెలుగు ప్రెసిడెంట్ అరవింద్ కొత్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1500 మంది అమెరికన్ తెలుగు వారు పాల్గొన్నారు. సంప్రదాయ పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా వేదికను తీర్చిదిద్దారు. సాంస్కృతిక పొటీలలో వందకు పైగా నృత్య, పాటల బృందాలు పాల్గొని ఆహ్వానితులను అలరించారు. చిన్నారులకు చిత్రకళ పోటీలు, ఫ్యాషన్ షోలు నిర్వహించారు. కార్యక్రమానికి ఫాగ్ వ్యవస్థాపకులు డాక్టర్ జాప్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ వైస్ కాన్సులేట్ హిమానీ ధమీజా హాజరై నిర్వాహకులను అభినందించి, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పోటీ విజేతలందరికీ ట్రోఫీలు అందజేశారు. మహిళా అచీవ్‌మెంట్ అవార్డులు పొందిన 30 మంది మహిళలను జ్ఞాపికలతో సత్కరించారు. సుప్రీంకోర్టు న్యాయవాది సునీతా బెండపూడి, రచయిత శ్వేతా సింగ్ కృతికి మహిళా అచీవ్‌మెంట్ అవార్డులను అందించి సత్కరించారు. ఫ్రీమాంట్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు థెరిసా కాక్స్ ను ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో కాన్సులేట్ సామాజిక కార్యదర్శి రుచిక శర్మ పాల్గొన్నారు. జోశర్మ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు. ఉగాది వేడుకలలో అందించిన ప్రామాణిక దక్షిణ భారత భోజనం, ఉగాది పచ్చడి, ఇతర వంటకాలతో కూడిన పసందైన విందు భోజనం ఆహుతులను ఆకట్టుకుంది.ఫాగ్ ప్రెసిడెంట్ రాజేష్ వర్మ జీ, విద్యా సేతురామన్, రీతూ మహేశ్వరి, ఫాగ్ తెలుగు వైస్ ప్రెసిడెంట్ అభిలాష్ , ఫాగ్ తెలుగు కల్చరల్ వైస్ ప్రెసిడెంట్స్ శుభా ఇంగోల్ ,హేమాంగిని వోరా, ఫాగ్ తెలుగు కార్యవర్గ సభ్యులు నాగేంద్ర, సునీత, ఫణి, వర్ష, గౌతమి, కృష్ణ, శ్రీనివాస్, రఘు , మేఘా మోచెర్ల మరియు అనేక మంది వాలంటీర్లు తమవంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z