NRI-NRT

అనాధలకు నాట్స్ టాంపాబే చేయూత

అనాధలకు నాట్స్ టాంపాబే చేయూత

నాట్స్ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని టంపాబేలో అనాథ పిల్లల కోసం పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచ్ మేకింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 30మంది ప్రవాసులు అనాథ పిల్లల కోసం శాండ్‌విచ్‌లను తయారు చేశారు. అనాథ పిల్లలకు సామాజిక బాధ్యతగా తోడ్పడాలనే సంకల్పంతోనే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ అచ్చిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z