కేరళలోని కొచ్చిన్‌లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియకూడదని అమెజాన్ పార్సిల్ కవర్లో శిశువును చుట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిన శిశువు ప్రాణాలు కోల్పోయింది. కాగా, కొందరు కార్మికులు పార్సిల్ కవర్లో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్శిల్ కవర్‌పై ఉన్న అడ్రస్‌ను బట్టి పోలీసులు నిందితురాలిని గుర్తించారు. ఈ ఘటనపై ఆమెను విచారిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z