* పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన సందేశ్‌ఖాలీ వ్యవహారం (Sandeshkhali incidents)లో కొత్త కోణాన్ని అధికార టీఎంసీ తెరపైకి తీసుకొచ్చింది. ఇదంతా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భాజపా (BJP) పన్నిన కుట్రేనని ఆరోపిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తననుతాను భాజపా సందేశ్‌ఖాలీ మండలాధ్యక్షుడిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. ఈ ఘటనల వెనక ప్రతిపక్ష నేత సువేందు అధికారి హస్తం ఉందని ఆరోపించాడని తెలిపింది. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సైతం ఈ ఘటనలు కమలం పార్టీ ముందస్తు ప్రణాళికలేనని ఆరోపించారు.
* ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఐదు కోట్ల మందికి జనసేన ధైర్యం నూరిపోసిందని చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని, దీని కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు.
* క్రికెట్ ఎలా ఆడాలో తెలియకుండానే భాజపా అగ్రనేత అమిత్ షా కుమారుడు జై షా .. బీసీసీఐలో ఉన్నతస్థానంలో ఉన్నారంటూ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) నేత సంజయ్ సింగ్(Sanjay Singh) విమర్శించారు. వారసత్వ రాజకీయాల గురించి కాషాయ పార్టీ చేస్తున్న విమర్శలను ఉద్దేశించి ఈవిధంగా స్పందించారు. ‘‘అమిత్ షా కుమారుడికి బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలుసా..? కానీ ఆయన ఇప్పుడు బీసీసీఐలో చక్రం తిప్పుతున్నారు. ప్రధాని మోదీ 73 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నారు. కానీ జవాన్లకు మాత్రం వయసు పరిమితిని 21 ఏళ్లకు కుదించారు. ఈ వ్యక్తులు ఘోరమైన పరివారవాదీలు. మోదీ, అమిత్ షా, భాజపా నేతలకు తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడం మినహా మరో పని లేదు. కానీ మేం మాత్రం దేశం కోసం పని చేస్తున్నాం’’ అని సింగ్ విమర్శలు చేశారు.
* ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. రాయ్‌బరేలీ నుంచి అగ్రనేత రాహుల్‌గాంధీని పోటీలోకి దింపగా.. అమేఠీ నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిశోర్ లాల్ శర్మను ఎంపిక చేశారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ సిటింగ్ ఎంపీగా ఉన్న రాహుల్.. అక్కడినుంచి మరోసారి పోటీ చేశారు. ఏప్రిల్ 26న పోలింగ్ పూర్తయ్యింది. రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్ బరిలోకి దిగడంపై వయనాడ్ ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
* నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు శుక్రవారం రాత్రి ఆయన కార్యాలయంపై దాడులు చేశాయి. సుమారు ఆరు గంటలకు పైగా అధికారులు సోదాలు చేశారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు వార్డుల్లో కూపన్లు, డిజిటల్ వాచ్‌లు, గాజులు, చీరలు, నగదు పంచేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. రాత్రి సుమారు 2 గంటల వరకు సోదాలు నిర్వహించారు.
* అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి స్వగ్రామంలో ఆ పార్టీ శ్రేణులు దాడులకు తెగబడ్డారు. కూటమి అభ్యర్థికి మద్దతిస్తున్న వ్యక్తి ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో ప్రచారం చేసుకుంటున్న సమయంలో.. వైకాపా నాయకులు, కార్యకర్తలు వచ్చి నలుగురిపై దాడికి పాల్పడ్డారు. డ్రోన్ కెమెరాతో పాటు సామగ్రిని ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న బూడి ముత్యాల నాయుడు భాజపా నాయకుడిపై చెప్పుతో దాడి చేశారు. బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దెబ్బలుతిన్న కార్యకర్తలనే స్టేషన్‌కు తీసుకెళ్లారని కూటమి నేతలు తెలిపారు.
* భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్ స్థానంలో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను భాజపా బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతోన్న తరుణంలో.. బ్రిజ్‌భూషణ్ స్థానికంగా తనకున్న పట్టును ప్రదర్శించారు. శుక్రవారం కరణ్ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హడావుడి చేశారు. నామినేషన్‌కు ముందు నిర్వహించిన సభకు 10 వేలమంది హాజరయ్యారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లు, భాజపా స్థానిక నేతలు, అయోధ్యలోని ప్రముఖ అఖాడాలకు చెందిన పెద్దలు ఉన్నారు. అలాగే 500-700 వరకు ఎస్‌యూవీలు మైదానంలో పార్క్ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
* దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (DPCC) అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి సమక్షంలో శనివారం ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన రోజు తాను ఏ పార్టీలోనూ చేరబోనంటూ పేర్కొన్న ఆయన.. వారం తిరగకముందే భాజపాలో చేరడం గమనార్హం. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం భాజపాలో చేరారు.
* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. జగన్‌కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని విమర్శించారు. దోపిడీకి ఆయన సామ్రాట్ అని ఎద్దేవా చేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
* టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణకు సీఐడీని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
* ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని సీఎం అన్నారు. బాబు మోసాలకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తున్నాం. జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారు.’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?. కొత్త 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్. 14 ఏళ్లలో ఏరోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. రైతులకు అండగా ఆర్‌బీకే వ్యవస్థను నెలకొల్పాం. ఉద్ధానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం’’ అని సీఎం చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z