Devotional

Telugu Horoscope – May 05 2024

Telugu Horoscope – May 05 2024

మేషం
అదృష్ట ఫలాలు అందుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం అందుతుంది. చంద్ర ధ్యానం చదవాలి.

వృషభం
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మాసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం.

మిథునం
ముఖ్య వ్యవహారాలలో లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. శివ సందర్శనం శుభప్రదం.

కర్కాటకం
ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహం
మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీశివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

కన్య
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల
అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాల వల్ల మేలు జరుగుతుంది. గోవిందా నామాలు చదవటం మంచిది.

వృశ్చికం
శారీరకశ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

ధనుస్సు
మంచి ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

మకరం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు.

కుంభం
తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. శివ నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z