* ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. వైకాపావి నవరత్నాలు కాదు.. నవమోసాలని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొస్తున్నామని చెప్పారు.
* సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసినచోట్ల చప్పగా సాగింది. ఏ దశలోనూ 70శాతం దాటలేదు. దీంతో ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు, స్థానిక అధికారులు, వివిధ ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి సమష్టి యత్నం మొదలుపెట్టారు. ఓటు వేయడాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ఆఫర్లు, కార్యక్రమాలు చేపట్టారు.
* ‘రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకట్లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఏం చెబుతారో దానిని తప్పకుండా చేస్తారని, రాహుల్ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదని అన్నారు.
* నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. భాజపా, భారస ..తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
* దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (డెళి ఏక్ష్చిసె ఫొలిచ్య్ శ్చం ఛసె)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (ఆర్వింద్ ఖెజ్రివల్)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలి ఛార్జ్‌షీట్ (చర్గెషీత్) రూపొందిస్తున్నట్లు సమాచారం.
* కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ప్రచారం పేరుతో ఇంటింటికీ వెళ్లి.. గోడలకు, తలుపులపైన ‘సిద్ధం’ స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ప్రజలకు ఇచ్చే కరపత్రాలకు సైతం ఎన్నికల సంఘం అనుమతి ఉండాలి. కానీ, అవేవీ పట్టించుకోకుండా వైకాపా నేతలు, కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
* హరియాణా (హర్యన)లో రాజకీయ అస్థిరత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వానికి ఇటీవల ముగ్గురు స్వతంత్రులు (ఈందెపెందెంత్ ంళాస్) మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది.
* భాజపా ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు దిల్లీకి గులామ్‌గిరీ చేస్తున్నారని మండిపడ్డారు.
* సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (ఫవన్ ఖల్యన్) రాజకీయ మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలపించాలని కోరుతూ అగ్ర కథానాయకుడు చిరంజీవి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ (ఆల్లు ఆర్జున్) పవన్‌కు మద్దతు తెెలిపారు. ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్‌పెట్టారు. ‘‘పవన్‌కల్యాణ్‌గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.
* ఈ దేశంలో రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ‘‘గొప్ప మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారు. ఎంతో గొప్పదైన మన రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు చెబుతున్నారు. దేశంలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయి. దాంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయి.
* ‘ఎవరైనా నిన్ను అవమానిస్తే, చిరునవ్వుతో వాళ్లకు సమాధానం చెప్పు. అంతేకానీ, వాళ్లతో వాదనకు దిగకు. అలా దిగితే అవతలి వ్యక్తి గెలిచినట్లు’ అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్ (ఫురి ఝగన్నధ్). ‘పూరి మ్యూజింగ్స్’ (ఫురి ంఉసింగ్స్) పేరుతో వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ఇన్సల్ట్’ (అవమానం) అనే విషయం గురించి మాట్లాడారు.
* భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. ఈస్టర్న్ డే టైమ్ (ఏడ్ట్) ప్రకారం ఈ నెల 17న సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z