Politics

అంబానీ-అదానీల కోసం పేదలను దోచిన ప్రభుత్వం ఇది

అంబానీ-అదానీల కోసం పేదలను దోచిన ప్రభుత్వం ఇది

ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారికి ఓటు వేయాలని, రాజ్యాంగాన్ని రద్దుచేయాలనుకునే వారికి బుద్ధిచెప్పాలని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. దేశానికి నియంతలా వ్యవహరించే, అబద్ధాలు చెప్పే మోదీ కావాలో.. బలమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే రాహుల్‌ గాంధీ కావాలో ప్రజలు ఓటు ద్వారా నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘‘పదేళ్లలో మోదీ ఎ-ఎ (అదానీ-అంబానీ) ట్యాక్స్‌ విధించి.. పేదల ధనాన్ని బిలియనీర్లకు దోచిపెట్టారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. 70 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నా.. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రైతుల రుణాలు మాఫీ చేయకుండా.. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటు విద్వేషాన్ని పేదలకు బహుమతిగా ఇచ్చారు అని’ విమర్శించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ప్రాణాలైనా ఇస్తారు గాని.. రాజ్యాంగాన్ని మార్చనీయబోరని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మోదీ రాయలేదని, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. శనివారం తాండూరు జనజాతర సభ, కామారెడ్డి రోడ్‌షోలో ప్రియాంకా గాంధీ ప్రసంగించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z