NRI-NRT

విజయవంతంగా తానా సీపీఆర్ శిక్షణ సదస్సు

విజయవంతంగా తానా సీపీఆర్ శిక్షణ సదస్సు

ఫ్రిస్కోలో తానా-టాంటెక్స్ సంస్థల ఆధ్వర్యంలో శనివారం నాడు నిర్వహించిన సీపీఆర్ శిక్షణా శిబిరం విజయవంతం అయిందని తానా ప్రాంతీయ ప్రతినిధి దేవినేని పరమేష్ తెలిపారు. 65మంది ప్రవాసులు ఈ సదస్సులో పాల్గొని అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే పలు విధానలపై అవగాహన పెంపొందించుకున్నట్లు వెల్లడించారు. చుక్కల కిషోర్ ఈ శిబిరంలో పలు విషయాలను వివరించారు. క్యాన్సర్ నివారణ, రక్తదానం ప్రాముఖ్యత వంటి విషయాలపై వీ.ఆర్.చిన్ని అవగాహన కల్పించారు. 12మంది విద్యార్థులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు. తానా-టాంటెక్స్ ప్రతినిధులు కిషోర్, చిన్నిలను సత్కరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z