DailyDose

యూపీలో ప్రియాంక గాంధీ అరెస్ట్-తాజావార్తలు–07/19

Priyanka Gandhi Arrested-Today Breaking News In Telugu-July192019

* కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నారయణ్‌పూర్ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులను కలుసుకోవడానికి ప్రియాంక శుక్రవారం అక్కడికి వెళ్లారు. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నందున ఎలాంటి పర్యటనలను అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు.అంతేకాకుండా ప్రియాంకతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా.. సోంభద్ర సమీపంలోని ఓ ఐఏఎస్ అధికారి తనకి చెందిన 22 ఎకరాలను రెండు సంవత్సరాలు క్రితం యాగ్య దత్ అనే వ్యక్తికి అమ్మారు.అయితే దత్ భూమిని ఆక్రమించుకునేందుకు కొంత మంది ప్రయత్నించగా భారీగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే బుధవారం ఇరు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరి.. తుపాకులతో ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
*ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో వేషం వేయాలని నటులు అవుదామనుకునే చాలా మందికి ఉంటుంది. అయితే ఆ అవకాసం అతి కొద్ది మందికే వస్తుంది. అయితే ఇలాంటి పెద్ద సినిమాలో వేషం వేయాలనే ఆశ పోని వాళ్లు మోసం చేయటానికి చాలా మంది రెడీ గా ఉంటారు. అయితే లా చదువుకుని నిత్యం కేసులు, పోలీస్ లు , కోర్ట్ లు అంటూ తిరిగే న్యాయవాదిని మోసం చేయటానికి మాత్రం ఎవరూ సాహసించరు. కానీ అనుకోనిది జరిగితేనే కదా వార్త. ఇప్పుడు ఓ మహిళా న్యాయవాది సినిమాలో వేషం నిమిత్తం యాభై లక్షలు పోగొట్టుకోవటమే ఆశ్చర్యంగా మారింది. వివరాల్లోకి వెలితే…ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళ వద్ద నుంచి రూ 50లక్షలు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురిని సెంట్రల్ జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మారుతి కారు, 19.270 గ్రాముల బంగారు ఆభరణాలు, 111.550 గ్రాముల వెండి వస్తువులు, రూ.65,000 నగదు, ఫ్రిజ్, మొబైల్ ఫోన్లు, టివిలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌కు చెందిన వీరబత్తిని నరేష్ కుమార్ అలియాస్ నరేష్ బంజారాహిల్స్‌లోని కోని ల్యాబ్స్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నల్గొండ జిల్లా, చరగొండ గ్రామానికి చెందిన మునుకుంట్ల రామకృష్ణ అలియాస్ రామా పేయింటర్‌గా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌కు చెందిన కొమ్ము సోమన్న పేయింటర్‌గా పనిచేస్తున్నాడు.ముగ్గురిని అరెస్టు చేయగా 13మంది పరారీలో ఉన్నారు. జస్ట్ డయల్ లో బాధితురాలి నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు.తాను సినీ నిర్మాత ఆదిత్యను మాట్లాడుతున్నానని, చాలా సిన్మాలు తీశానని, నాకు డైరెక్టర్ రాజమౌళి తెలుసని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి ఉందా అన్ని అడిగాడు. ఆసక్తి ఉంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో తల్లి పాత్రకు అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. వేరు వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసి రాజమౌళి వలే మాట్లాడేవాడు. ఆమె పేరుతో ఫిల్మ్ ఛాంబర్ ఐడి కార్డు, మా ఐడి కార్డు, టివి సీరియల్ కార్డు తదితర వాటిని తీసుకోవాలని చెప్పడంతో దశల వారీగా డబ్బులు పంపించింది. జనవరి, 2109నుంచి జూన్ వరకు 40 నుంచి 50లక్షల రూపాయలు వివిధ బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ క్రమంలోనే 17,ఏప్రిల్ ,2019వ తేదీన ఆదిత్య బాధితురాలకి ఫోన్ చేసి ఫిల్మ్ సైట్‌కు వెళ్లాలని తన కారు రిపేరుకు వచ్చిందని, బాధితురాలి కారు స్విఫ్ట్ డిజైర్ ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇది నమ్మి కారును ఇచ్చింది అప్పటి నుంచి తిరిగి ఇవ్వలేదు. తర్వాత కూడా పదేపదే డబ్బులు అడుగడం, ఫోన్‌లో భూతులు తిట్టడం చేయడంతో తను మోసపోయానని గ్రహించి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది కేసు దర్యాప్తు చేశారు.
* భారీ వర్షాలు బిహార్‌ను ముంచెత్తుతున్నాయి. నేపాల్‌లో వర్షాలు కురుస్తుండటంతో దాని ప్రభావం రాష్ట్రం మీద కూడా పడింది. గత కొన్ని రోజులుగా బిహార్‌లో కురుస్తున్న వర్షాలకు 78 మంది మృతి చెందారు.
* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్న కేశంపేట తహసీల్దార్‌ లావణ్య నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.. లావణ్యను రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలతో లావణ్యను కస్టడీలోకి తీసుకోనున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ అవినీతి జలగ చంచల్‌గూడ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉంది.
* పట్టణాల్లో ని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో భాగంగా పేదలు 75 గజాల్లోపు ఇల్లు నిర్మించుకుంటే వారికి రూపాయికే రిజిస్ట్రేషన్ సదుపాయంకల్పిస్తారు. ఏడాదికి ఇంటి పన్ను కూడా వంద రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు.
* కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2020 వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారి నుంచి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్రదినోత్సావాన్ని పురస్కరించుకొని అవార్డులు ఇస్తామన్నారు. చిత్రలేఖనం, సామాజిక, సేవ, ప్రజాసంబంధాలు, సైన్స్, ఇంజనీరింగ్, ట్రేడ్, అండ్‌ ఇండస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, విద్య, సివిల్‌సర్వీస్, క్రీడలు, తదితరరంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి పద్మ అవార్డుకు ఎంపిక చేస్తారు
*ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాంప్రశ్నోత్తరాలు చేపట్టారు.
*17వ లోక్సభ తొలి సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయి. జూన్ 17న ప్రారంభమై, ఈ నెల 26 వరకూ సమావేశాలు కొనసాగనున్నాయి. గత ఇరవై ఏళ్లలో 128 శాతం ఉపయోగకరంగా జరుగుతున్న సమావేశాలుగా ఈ దఫా మీటింగ్స్ చరిత్ర సృష్టించాయని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది.బడ్జెట్పై 17 గంటలపాటు చర్చ జరగగా, రైల్వే కేటాయింపులపైన 13, రహదారులు భవనాలపైనా 7.44 గంటల పాటు లోక్సభలో చర్చించారు.గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి కేటాయింపులపై 10.36 గంటల పాటు చర్చ జరిగింది. క్రీడలు, యువజన వ్యవహారాలపై 4.14 గంటల పాటు లోక్సభ సమావేశమైంది.గత కొద్దిరోజులుగా శూన్య గంటను నిర్వహించలేదు. గురువారం నాటి శూన్యకాలంలో ప్రజలకు అత్యవసరమైన అంశాలను లేవనెత్తాలని సభ్యులకు సూచించారు స్పీకర్ ఓం బిర్లా.గురువారం శూన్యకాలం గడువును పొడిగించిన సమయంలో 162 మంది సభ్యులు వివిధ ప్రజోపయోగకరమైన అంశాలను లేవనెత్తారు. ఈ కారణంగా రాత్రి 10.50 గంటల వరకు సభలో చర్చ జరిగింది.
*పింఛన్‌దారులకు మధ్యంతర భృతి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పింఛన్‌దారులకు 27 శాతం మేర మధ్యంతర భృతి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 వేతన సవరణ పొంది 2013 జులై 1 తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఆ తేదీ కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ మధ్యంతర భృతి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. జాగీరు, ఎస్టేట్ పెన్షనర్లు, 1980 పింఛన్ వేతన నిబంధనలకు అనుగుణంగా ఉన్న సర్వీసు పెన్షనర్లకు ఈ పెంపును వర్తింప చేయనున్నారు.
*కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగకుండానే సభ వాయిదా పడిన సమయంలో కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలా మరో బాంబు పేల్చారు.శాసనసభలో బల నిరూపణకు కర్ణాటక ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపు సభ విశ్వాసాన్ని పొందాలని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి లేఖ రాశారు వాజుభాయి.
*కడప జిల్లాచక్రయపేట ఎస్సీ హాస్టల్ లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హరి కిరణ్.. హాస్టల్లో మౌలిక వసతులపై కలెక్టర్ హరికిరణ్ ఆరా..హాస్టల్లో వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ..మరుగుదొడ్లను పరిశీలన..హాస్టల్ పిల్లలతో కలిసి కాసేపు క్యారంబోర్డు ఆడిన కలెక్టర్ ..సిఎం జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారి హాస్టళ్లలో పల్లె నిద్ర.
*ఏపీలో కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలలో కొన్ని చోట్ల మోస్తరు జల్లులు నుండి భారీ వర్షం కురిసింది. కాగా మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయని, తెలంగాణలో కూడా రేపటి నుండి జల్లులు కురి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య పశ్చిమ బంగాళాఖాతం, దక్షణ ఒడిశా తీరప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని.. ఈనెల 22 వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని తెలిపింది.
*ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి (2019-20) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 30 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ర్టార్‌ డీ భాస్కరరావు గురువారం ప్రకటించారు.
*ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలు నిర్వహించారు. గత వారం లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సత్యవతి ఎయిమ్స్ సభ్యులుగా ఎన్నికయ్యారు. తాజాగా విజయసాయిరెడ్డి మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
*కర్ణాటక విధానసభలో గురువారం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం రణగొణధ్వనుల మధ్య ఎంతకూ తేలలేదు. తీవ్ర గందరగోళం తలెత్తి చివరకు సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో రాజ్యాంగ, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి తనకు తానుగా విశ్వాస పరీక్షకు గడువు కోరి స్పీకర్ అనుమతితో గురువారం ఓటింగ్కు హాజరయ్యారు.
*రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్లపై ఇస్తున్న రాయితీల భారాన్ని తగ్గించుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి పెట్టింది. ‘టికెట్ రాయితీని వదులుకోండి’ అంటూ వయోధికులకు విజ్ఞప్తి చేస్తోంది.
*రుతుపవనాలు వస్తున్నాయనగానే అందరికంటే ఆతృతగా ఎదురుచూసేది రైతన్నలే. ఈసారి సాధారణ వర్షపాతమే కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించగానే కోటి ఆశలతో నైరుతి కోసం ఎదురు చూసిన రైతన్నకు ఇప్పుడు దిక్కుతోచడంలేదు.
*కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను తెరాస రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేసుకుందని కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు. సభలో బిల్లులపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తేందుకు పలుమార్లు ఆయన ప్రయత్నించారు. సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి బిల్లులపైనే మాట్లాడాలని సూచిస్తూ మైక్ను నిలిపివేశారు.
*దేశంలోని ప్రజలందరూ 2030 నాటికి విద్యావంతులు కావాలన్నదే నూతన విద్యా విధానం లక్ష్యమని జాతీయ విద్యా విధానం కమిటీ ఛైర్మన్, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ స్పష్టం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో సుస్థిర అభివృద్ధికి నూతన విధానం బాటలు వేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
*భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ ఎనిమిది గేట్లను గురువారం తెరిచారు. కన్నెపల్లి పంపుహౌస్లోని పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ బుధవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేయటం వల్ల నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉండటంతో మేడిగడ్డ బ్యారేజీ గేట్లను తెరిచారు.
*రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెలిపారు. వచ్చే నెలరోజులు వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
*అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం నుంచి రోజూ ఒకటి లేదా రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 12 బిల్లుల వరకు ప్రవేశపెట్టనుంది. వీటికి సంబంధించిన ముసాయిదా బిల్లులపై గురువారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.
*దేశంలో అణచివేతలు, నిర్భందాలు లేని ప్రజాస్వామ్యం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో గురువారం అమరుల బంధుమిత్రుల సంఘం (ఏబీఎంఎస్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ‘రాజ్య నిర్బంధం- త్యాగాల పరంపర’ అనే అంశంపై సభ జరిగింది.
*కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి ఇంటికీ కుళాయి నీరు పథకం.. తెలంగాణలోని మిషన్ భగీరథకు; పీఎం కిసాన్ పథకం తెలంగాణ రైతు బంధుకు నకళ్లని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై గురువారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
*ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వబోమని ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. రూ.7,200 కోట్ల రుణం ప్రతిపాదనను తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకుంది.
*రాష్ట్రంలో ఏడేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీలు వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేసింది. గతంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు భార్యాభర్తలైన ఉపాధ్యాయులను సమీప ప్రాంతాల్లోని లేదా ఒకే పాఠశాలకు బదిలీ చేయాలని జాక్టో ప్రతినిధులు జి.సదానంద్గౌడ్, ఇ.రఘునందన్, కె.రమణ, జి.సోమయ్య, కె.కృష్ణుడు తదితరులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
*రాష్ట్రంలో ఏడేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీలు వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేసింది. గతంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు భార్యాభర్తలైన ఉపాధ్యాయులను సమీప ప్రాంతాల్లోని లేదా ఒకే పాఠశాలకు బదిలీ చేయాలని జాక్టో ప్రతినిధులు జి.సదానంద్గౌడ్, ఇ.రఘునందన్, కె.రమణ, జి.సోమయ్య, కె.కృష్ణుడు తదితరులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
*ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం (తపస్) ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్ష నిర్వహించనుంది.
*ఎమ్మార్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదుచేసిన అభియోగపత్రంలో నిందితుడైన కోనేరు మధుకు గురువారం హైకోర్టులో ఊరట లభించింది.
*ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం (తపస్) ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్ష నిర్వహించనుంది.
*రాష్ట్రంలో శుక్రవారంతో పాటు శని, ఆదివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలు, దక్షిణ ఒడిశా తీరప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది.
*రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య సీట్ల భర్తీ ప్రక్రియను ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగా ఆన్లైన్ ద్వారా భర్తీ చేయనున్న సీట్లకు అర్హులైన అభ్యర్థులు నేరుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో హాజరవ్వాల్సి ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
*రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి-టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
*రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్య సీట్ల భర్తీ ప్రక్రియను ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగా ఆన్లైన్ ద్వారా భర్తీ చేయనున్న సీట్లకు అర్హులైన అభ్యర్థులు నేరుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో హాజరవ్వాల్సి ఉంటుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
*ఈ నెల 21 నాటికి విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజ్భవన్ స్థాయిలో తీర్చిదిద్దుతామని గవర్నర్ కార్యదర్శి ముఖేశ్కుమార్ మీనా తెలిపారు. భవనంలోని మొదటి అంతస్తుని గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒక దర్బార్ హాలు, ఒక మీటింగ్ హాలు, ఏడు కార్యాలయ గదులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రియల్టైం గవర్నెన్స్ ఒక వినూత్న ప్రక్రియ అని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అధికారులు ప్రశంసించారు. కాగ్ డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్య్రూ డబ్ల్యూ.కె.లాంగ్స్టీ నేతృత్వంలో 17 మంది అధికారుల బృందం సచివాలయంలోని ఆర్టీజీఎస్ స్టేట్ కమాండ్ కేంద్రాన్ని గురువారం సందర్శించింది.
* ఫ్రీవైఫై అమలులో సికింద్రాబాద్రైల్వే స్టేషన్ దేశంలోనే ముందుంది. రైల్వేలో వై-ఫై సౌకర్యం ఉన్న 1,600కు పైగా స్టేషన్లలో సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యధిక వినియోగదారులతో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. 2019 మేలో సికింద్రాబాద్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 207 స్టేషన్లలో 40 టెరాబైట్ల డాటాను 10 లక్షలకు పైగా ప్రయాణికులు వాడారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విజయవాడ, తిరుపతి, గుంతకల్లు స్టేషన్లలోనూ అత్యధిక స్థాయిలో వై-ఫైని వాడారు. కాగా, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఉద్యమానికి ఊతమిస్తూ రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతులు అమలు చేయడానికి రైల్వే ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ఫ్రీ హైస్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వై-ఫై సౌకర్యం కల్పిస్తోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని 36 ప్రధాన రైల్వే స్టేషన్లు (ఏ-1, ఏ కేటగిరి), 171 చిన్న స్టేషన్లు (బి, సి, డి, ఇ కేటగిరి) మొత్తం 207 స్టేషన్లలో వై-ఫై సౌకర్యం ఉంది. అన్ని ఏ-1, ఏ, బీ, సీ,డీ కేటగిరీ స్టేషన్లలోనూ, కొన్ని ఇ కేటగిరీ స్టేషన్లలోనూ వై-ఫై సౌకర్యం ఏర్పాటు పూర్తయ్యింది. 76 ఇ -కేటగిరీ స్టేషన్లలో వై-ఫై ఏర్పాటు పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగిలిన 291 ఇ- కేటగిరీ స్టేషన్లలో వై-ఫై పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే లోని అన్ని రైల్వే స్టేషన్లలో (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -కేటగిరీ స్టేషన్లు మినహాయించి) వై-ఫై సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
* ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ లో సచిన్ కి చోటు దక్కింది. సచిన్ తోపాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలన్ డోనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ క్యాథిరిన్ లకు కూడా ఈ అవకాశం దక్కింది. ఐసీసీ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.లండన్ లో నిర్వహించిన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో సచిన్ పాల్గొని మాట్లాడారు. తనకు ఈ గుర్తుంపు లభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇది చాలా గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.సచిన్ కి ఈ గౌరవం లభించడం పట్ల ఐసీసీ కూడా స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్ లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ అని పేర్కొంది. లెజెండ్ అనే పదం సచిన్ కి చాలా తక్కువ అని పేర్కొంది. తాజాగా సచిన్ కి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించాం అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సచిన్ కి పలువురు క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.