సింగపూర్‌కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. చిన్న వయసులో పిల్లల్ని కనడం వల్ల కలిగే ఇబ్బందులనూ సోషల్ మీడియాలో వివరించారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక ప్రచురించింది. సింగపూర్‌కు చెందిన షిర్లీ లింగ్ వయసు 34 ఏళ్లు. ఓ చికెన్ రెస్టారంట్‌ను నడుపుతోన్న ఆమె 17ఏళ్ల వయసులోనే తల్లి అయ్యారట. ఆమెకు ఇప్పటికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఐదుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. పెద్ద కుమారుడికి గతేడాది ఓ పాప పుట్టినట్లు వెల్లడించారు. ఆమె ఈ విషయం తెలిసి తానేమీ ఆశ్చర్యపడలేదని.. తనను చూసి స్ఫూర్తి పొంది ఉండవచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
‘నా కుమారుడు సరదాగా ఉంటాడు. ఈ క్రమంలో తన గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని నాతో చెప్పాడు. అనంతర పర్యవసానాలకు అతడిదే పూర్తి బాధ్యత అని చెబుతూ నిర్ణయాన్ని తనకే వదిలేశాను. అయితే, చిన్న వయసులో పిల్లల్ని కనాలనే ప్రోత్సహించలేదు. బాధ్యతల గురించి, ఎదురయ్యే సవాళ్ల గురించి వివరించా’ అని లింగ్ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z