NRI-NRT

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలకు భారీగా విరాళాలు

సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలకు భారీగా విరాళాలు

అమెరికాలోని మిస్సోరి రాష్ట్ర సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో మే 24-28 వరకు నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా విరాళాలు లభించాయి. శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, బ్రహ్మోత్సవల కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు. పంచ వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశామని, ప్రత్యేకంగా వైదిక, ఆగమ శాస్త్ర పండితులను బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

₹8కోట్లకు విరాళాలు లభించినట్లు బ్రహ్మోత్సవాల నిధుల సేకరణ కమిటీ అధ్యక్షుడు బుడ్డి విజయ్ తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా, లోటు లేకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులకు వీనులవిందుగా, లోక కళ్యాణార్థం నిర్వహించేందుకు ఈ నిధులను సద్వినియోగం చేస్తామని పేర్కొన్నారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, ఉత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళీ, బోర్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవాల కమిటీ సభ్యులు తదితరులు వేడుకల విజయవంతానికి కావాల్సిన ఏర్పాట్లను సమన్వయపరుస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z