NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో ఉగాది వేడుకలు

హాంగ్‌కాంగ్‌లో ఉగాది వేడుకలు

హాంగ్ కాంగ్ ప్రవాసులు ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కే.వెంకటరమణ- భారత కాన్సల్, ఏమి యుంగ్ (డిస్ట్రిక్ట్ ఆఫీసర్ – హాంగ్ కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్), లాల్ హర్దసాని (ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్), ఉస్తాద్ గులాం సిరాజ్ (చైర్మన్ పుంహక), కె.వెంకటవంశీధర్ (రీజినల్ హెడ్-స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా)లు అతిథు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వెంకటరమణ హాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ – సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ మరియు యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో, హాస్యనాటికతో కార్యక్రమం ఆకట్టుకుంది. స్వచ్ఛంద సేవకులకు, తెలుగుబడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో, ఆక్స్‌ఫామ్ ట్రయిల్ వాకర్లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారిని గుర్తిస్తూ మొమెంటోలు అందించారు.

సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి సభికులకు శుభాకామ్కలు తెలిపి సంస్థ కార్యక్రమాలను వివరించారు. కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మన్నే,రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా, అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష, రవికాంత్ గునిశెట్టి, కల్పన,జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక & బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z