* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్)తో పాటు టాటా మోటార్స్ బ్రాండ్‌పై కొత్త ఉత్పత్తులు, సాంకేతికతల ఆవిష్కరణ కోసం 2024-25లో రూ.43,000 కోట్ల పెట్టుబడులు పెడతామని గ్రూప్ ప్రకటించింది.
* ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలో జమ చేసిన మొత్తం పదవీ విరమణ కోసమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం.. ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో వైద్య ఖర్చుల కోసం చేసే ఆటోక్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో తాజాగా ఈపీఎఫ్‌ఓ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రూల్ 68జె కింద ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. దీంతోపాటు రూల్ 68కె కింద ఉన్న విద్య, వివాహం, రూల్ 68బి కింద ఉన్న గృహనిర్మాణం లాంటి సందర్భాల్లో రూ.లక్ష వరకు ఆటో సెటిల్‌మెంట్ కింద పొందొచ్చు.
* దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్ (Harley Davidson) భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్-440 మోటార్ సైకిల్‌కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరిన్ని ఏళ్లు కొనసాగించడంతో పాటు ఇతర దేశాలకూ ఇక్కడ తయారుచేసిన మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేయాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించి ఓ సంయుక్త ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దేశీయంగా ప్రీమియం మోటార్ సైకిళ్లకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో దేశీయ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు హీరో-హార్లే భాగస్వామ్యంలో ఎక్స్-440 మోడల్ వచ్చింది. దీని ధరను రూ.2.4 లక్షలుగా నిర్ణయించారు. బజాజ్- ట్రయంఫ్ భాగస్వామ్యంలో స్పీడ్ 400 కూడా అదే సమయంలో విడుదలైంది. దీంతోపాటు హార్లే డేవిడ్‌సన్ ఎక్స్-440కు సొంత వేరియంట్‌ను మేవ్రిక్ బ్రాండ్‌పై హీరో మోటోకార్ప్ తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఈ రెండు మోడళ్లకు చెందిన 15 వేల యూనిట్లను హీరో విక్రయించింది. డిమాండ్ దృష్ట్యా నెలవారీ తయారీ సామర్థ్యాన్ని సైతం 6 వేల నుంచి 10 వేలకు పెంచింది. ఒకప్పుడు హార్లే డేవిడ్‌సన్ సొంతంగా భారత్‌లో వాహనాలను విక్రయించేది. డిమాండ్ లేని కారణంగా 2019లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ముఖ్యంగా దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో దేశీయ మోడళ్లకు ఈ బైక్స్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాయి. ఈ క్రమంలోనే హీరో మోటోకార్ప్‌తో జట్టు కట్టింది. ఇందులోభాగంగా దేశీయంగా మోటార్‌సైకిళ్ల తయారీ, విక్రయం, విడి భాగాల విక్రయం వంటివి హీరో మోటో కార్ప్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని మోడళ్లు తీసుకురావడంపై ఇరు కంపెనీలు దృష్టి సారించాయి.
* ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ రివార్డ్స్ పేరిట ఈ మధ్య వాట్సప్ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరికి సాధారణ ఎసెమ్మెస్‌ల రూపంలోనూ మోసపూరిత లింకులు వస్తున్నాయి. వాటిపై క్లిక్ చేసి పలువురు నష్టపోయిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఎస్‌బీఐ పేరిట వాట్సప్‌లో రివార్డ్స్ (SBI Rewardz) లింకు విస్తృతంగా ప్రచారమవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్ముతున్నారు. ఫలితంగా సులభంగా మోసపోతున్నారు. ‘మీ ఎస్‌బీఐ రివార్డ్ రూ.7,250 యాక్టివేట్ అయింది. దీని గడువు ఈరోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’ అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ యోనో పేరిట ఓ లింకును సైతం జత చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z