NRI-NRT

Singapore-VAM: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వాసవీ జయంతి

Singapore-VAM: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వాసవీ జయంతి

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్‌ విభాగం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి సందర్భంగా పూజ కార్యక్రమాలు జరుపుతామని సింగపూర్ విభాగం అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త తెలిపారు. దాతలు అందించిన స్వచ్ఛంద విరాళాలతో నంగునూరి వెంకట రమణ, సంకా వెంకట రవికుమార్‌, ఉద్దగిరి సతీశ్‌ ఆధ్వర్యంలో స్థానికంగా సెంగ్కాంగ్ లోని మరుగన్‌ జ్ఞాన మునీశ్వర్‌ ఆలయంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

వామ్‌ మహిళా విభాగం ప్రతినిధులుగా దీప భాస్కర్, వసుధ సతీష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వామ్ సింగపూర్ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సమస్త మానవాళికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంచర్ల శరత్ బాబు, కోట సతీశ్‌, కంకిపాటి శశిధర్ లతో పాటు నూతన కమిటీ సభ్యులు కొణిజేటి రవి కుమార్, ఓరుగంటి భాను ప్రసాద్, ఆలపాటి వెంకట రాఘవరావు, కాల్వ లక్ష్మణరాజు, కోట సుబ్బారావు, గాదంశెట్టి ఫణికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z