ScienceAndTech

చైనాకు వ్యతిరేకంగా తైవాన్ అద్భుత ప్రణాళిక-NewsRoundup-May 21 2024

చైనాకు వ్యతిరేకంగా తైవాన్ అద్భుత ప్రణాళిక-NewsRoundup-May 21 2024

* ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కూ (Kajal Aggarwal) చేదు అనుభవమే ఎదురైందట. ‘సత్యభామ’ (Satyabhama) ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. గతంలో తాను నటించిన ఓ సినిమా చిత్రీకరణలో ఎదురైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో నేను పాల్గొన్నా. తొలి రోజు చిత్రీకరణ పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనుమతి లేకుండా నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చాడు. చొక్కా విప్పి.. తన ఛాతీపై ఉన్న నా పేరుతో కూడిన టాటూని చూపించాడు. ఎవరూ లేని సమయంలో అతడలా చేయడంతో నేను భయపడ్డా. నాపై అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించినందుకు ఆనందమే. కానీ, ఇలా చేయడమే కరెక్ట్‌ కాదని సున్నితంగా హెచ్చరించా’’ అని అన్నారు.

* భారత ప్రధాన కోచ్‌ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి పొడిగింపుపై ఇంట్రెస్ట్‌గా లేడు. ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం కోరిన సంగతి తెలిసిందే. కొత్త కోచ్‌ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు సేవలందిస్తాడు. కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 డెడ్‌లైన్. ఈ క్రమంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, దిల్లీ కోచ్ రికీ పాంటింగ్‌తోపాటు కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

* ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి(ICC) అభ్యర్థన దాఖలైన సంగతి తెలిసిందే. దీని వెనక ఒక హీరో సతీమణి కీలకపాత్ర పోషించారు. ఆమె అందించిన సహకారం ఆధారంగానే ప్రధాన ప్రాసిక్యూటర్ పిటిషన్ వేశారు. ఆయనకు సహకరించిన నిపుణుల బృందంలో ఆమె కూడా ఒకరు. అమెరికాకు చెందిన నటుడు, ఫిల్మ్‌మేకర్ జార్జ్‌ క్లూనీ సతీమణి పేరు అమల్‌ క్లూనీ(Amal Clooney). ఆమె బ్రిటిష్‌- లెబనీస్‌ సంతతికి చెందిన ప్రముఖ బారిస్టర్. ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. అరెస్ట్‌ వారెంట్‌ కోసం ఐసీసీకి అభ్యర్థన వచ్చిన సమయంలో క్లూనీ ఫౌండేషన్ ఫర్ జస్టిస్‌ వెబ్‌సైట్‌లో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌, గాజాలో అనుమానిత యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరాలకు సంబంధించిన సాక్ష్యాలను పరిశీలించేందుకు తమ బృందంలో చేరమని కరీమ్‌ ఖాన్‌ అడిగారని ఆమె వెల్లడించారు. తమ నేపథ్యాలు వేరైనప్పటికీ.. చట్టపరంగా గుర్తించిన విషయాల్లో మాత్రం ఎటువంటి వైరుధ్యం లేదన్నారు.

* ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. పల్నాడు జిల్లా మాచవరం ఎంపీపీ కుమారుడిపై ఈ నెల 14న దాడి జరిగింది. ఈ కేసులో మోర్జంపాడుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నిఖిల్‌తో పాటు రైతు మోహనరావును పోలీసులు అరెస్టుచేశారు. ఆ కేసుతో తమకు సంబంధం లేదని, అరెస్టుకు ముందు పోలీసులు తీవ్రంగా కొట్టారని వారు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీరిద్దరూ రిమాండ్‌లో ఉన్నంత కాలం మూడు రోజులకోసారి జీజీహెచ్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయాలని జడ్జి ఆదేశించారు. ఇందులో భాగంగా సోమవారం నిఖిల్, మోహనరావును ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పోలీసులు గుంటూరు జిల్లా జైలు వద్దకు వచ్చారు. వారిని వాహనంలోకి ఎక్కించే ముందు నిఖిల్‌కు బేడీలు వేయడంతో ఆయన కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. ‘అసలు కేసే అక్రమంగా నమోదు చేశారనుకుంటే.. అది చాలదన్నట్లు చేతులకు బేడీలు వేయడం ఏంటి?’ అని వారు నిలదీశారు.

* తైవాన్‌ను బలప్రయోగం ద్వారా దక్కించుకొని.. చిప్‌ పరిశ్రమను ఏలాలన్న చైనా (China) కలను భగ్నం చేసేందుకు టెక్‌ కంపెనీలు ప్లాన్‌ చేశాయి. ఒకవేళ బీజింగ్‌ తన సైనిక బలంతో దురాక్రమణ చేస్తే.. ప్రపంచంలోనే అత్యాధునిక చిప్‌ తయారీ యంత్రాలు డిజేబులైపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంలోని ఇద్దరు అధికారులు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక కథనంలో పేర్కొంది.

* ఎన్నికల కోడ్‌ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్‌ఐఐసీపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఆరు నూతన పాలసీలు తయారు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ, ఎగుమతులు, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ టూరిజం, గ్రీన్‌ ఎనర్జీ, ఈవీ పాలసీలకు సవరణ చేస్తున్నట్టు వెల్లడించారు. టెక్స్ టైల్స్ రంగానికి సంబంధించి పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు.

* శత్రువు మెప్పు పొందుతోన్న నేతను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలా? అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath Singh) విరుచుకుపడ్డారు. పుల్వామా, ఉరీ దాడుల వెనక పాకిస్థాన్‌ ఉగ్రవాదుల హస్తం ఉందని ఆ దేశ మాజీమంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ గతంలో వెల్లడించారని, ఇప్పుడాయన రాహుల్‌ (Rahul Gandhi)ను ప్రశంసిస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ఝార్ఖండ్‌లోని బొకారోలో నిర్వహించిన ప్రచార సభలో రాజ్‌నాథ్‌ పాల్గొని ప్రసంగించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు.

* అమెజాన్‌పే- ఐసీఐసీఐ బ్యాంక్‌ కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో బ్యాంక్‌ కొంత కోత పెట్టింది. సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే వివిధ రకాల లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లను ఐసీఐసీఐ అందిస్తోంది. ఇన్నాళ్లు అద్దె చెల్లింపులపై కూడా 1 శాతం రివార్డు పాయింట్లు ఇస్తోంది. ఇకపై ఈ రివార్డు పాయింట్లు ఉండవని బ్యాంక్‌ తెలిపింది. జూన్‌ 18 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటికే యూజర్లకు సందేశాలు పంపుతోంది.

* ఐపీఎల్‌ 17వ సీజన్‌ను ముంబయి ఇండియన్స్‌ చివరి స్థానంతో ముగించింది. స్టార్లు ఉన్నా సరే నిలకడైన ఆటతీరును ప్రదర్శించడంలో ఘోరంగా విఫలమైంది. కెప్టెన్సీ మార్పు తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. రోహిత్ స్థానంలో హార్దిక్‌ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. దీంతో సీనియర్ల మధ్య సత్సంబంధాలు లేవని సోషల్ మీడియాలోనూ కామెంట్లు వెల్లువెత్తాయి. తమ జట్టు పరిస్థితిపై ఇప్పటికే ముంబయి ఓనర్ నీతా అంబానీ స్పందించారు. అయితే, ఒకప్పుడు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ సింగ్‌ మాత్రం ఫ్రాంచైజీ తీరుతోపాటు సీనియర్ ఆటగాళ్లపై అసహనం వ్యక్తంచేశాడు.

* బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరిన సీఎం రేవంత్‌ రెడ్డి. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం. మనవడి తలనీలాలు సమర్పించేందుకు తిరుపతి వెళ్తున్న రేవంత్‌ రెడ్డి. రాత్రికి తిరుపతిలో బస చేసి బుధవారం హైదరాబాద్‌ రానున్న సీఎం.

* మహారాష్ట్ర (Maharashtra)లోని పుణెలో ఓ బాలుడు లగ్జరీ కారుతో బైక్‌ను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమైన కేసు (Pune Car Crash Case)లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నిందితుడు స్థానికంగా ప్రముఖ వ్యక్తి కుమారుడు కావడంతో పోలీసులు అతడిని వీఐపీలా ట్రీట్‌ చేసినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌లో అతడికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

* అంతరిక్షంలో ఆయుధాల నిరోధక అంశానికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా (USA), రష్యాల మధ్య కొన్ని నెలలుగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో వాషింగ్టన్‌పై మాస్కో మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. అంతరిక్షంలో ఆయుధాలు ఉంచాలని అమెరికా భావించిందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితిలో రష్యా (Russia) తీర్మానాన్ని అమెరికా వీటోతో అడ్డుకున్న నేపథ్యంలో ఈవిధంగా స్పందించింది. ‘బాహ్య అంతరిక్షాన్ని ఆయుధరహిత ప్రాంతంగా చూడటం అమెరికా నిజమైన ప్రాధాన్యం కాదని, అక్కడ ఆయుధాలను ఉంచడం, సైనిక ఘర్షణకు వేదికగా మార్చడమే లక్ష్యంగా ఉన్నాయని మరోసారి నిరూపించారు’ అని రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా జకరోవా ఆరోపించారు.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (AI).. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటినుంచి చర్చ జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. దీనివల్ల ఉద్యోగాలు పోతాయనే వాదన ఓవైపు ఉండగా.. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకునే ఉద్యోగులు భారీ జీతాలు అందుకునే అవకాశాలు ఉన్నాయనేది నిపుణులు చెబుతున్న మాట. దీనిపై ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ (Infosys) సీటీఓ రఫీ తరఫ్దర్‌ (Rafee Tarafdar) మాట్లాడారు. ఏఐని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్‌ అన్నారు. ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ టూల్స్‌ నేర్చుకోవడం ముఖ్యమన్నారు.

* ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లలో భారాస ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. భారాస ప్రభుత్వం పనిచేసి కూడా చెప్పుకోలేకపోయింది. గత పదేళ్లలో ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. కృష్ణానదిపై కేంద్ర అజమాయిషీకి కేసీఆర్‌ ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నాగార్జునసాగర్‌ను కేంద్రం చేతిలో పెట్టారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు. భారాస నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

* ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ (MK Stalin) స్పందించారు. అవి ఒడిశా నుంచి తమిళనాడుకు చేరుకున్నాయని ప్రధాని ఆరోపించడంపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమిళ ప్రజలను అవమానించేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z