అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. అవేంటో తెలుసా? బాంబే బ్లడ్ గ్రూప్ రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా బ్లడ్ గ్రూప్‌ను నిర్ధారిస్తారు. శరీరంలో యాంటీజెన్ తక్కువగా ఉంటే అటువంటి బ్లడ్ గ్రూప్‌ను చాలా రేర్ గ్రూప్‌గా పరిగణిస్తారు. గత 52 సంవత్సరాల్లో కేవలం 43 మందికి మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది.
బాంబే బ్లడ్ గ్రూప్ అంటే… జన్యుపరంగా సంక్రమించే ఈ రకం బ్లడ్‌గ్రూప్‌ను ముంబై(ఒకప్పటి బొంబాయ్)కు చెందిన డాక్టర్ వైఎం బెండీ 1952లో గుర్తించారు. ఈ రక్తానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని నామకరణం చేశారు. అత్యంత అరుదైన ఈ రక్తం ఓ నెగిటివ్ గ్రూప్‌లోని మరో సబ్టైప్. దీనిని వైద్యపరిభాషలో ‘ఓహెచ్’గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం మిలియన్ మందిలో నలుగురికి మాత్రమే ఉండే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు. దేశంలో అతి తక్కువ మందికి అవసరం… దేశంలో అతితక్కువ మందికే బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరం ఉందని తేలింది. దీంతో వీరంతా కలిసి బాంబే బ్లడ్‌గ్రూప్ డాట్ ఓఆర్జీ పేరిట ఓ వైబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈ వైబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీరు డోనర్లు అవసరమైన రక్తాన్ని అందిస్తారు. ప్రస్థుతం ఈ వెబ్సైట్లో తొమ్మిది మంది తమకు బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమని తమపేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బేబీ సరియా అమీన్, అనంతపురంకు చెందిన శైలజలు ఉండడం గమనార్హం. ఈ వెబ్సైట్ విశ్లేషణ ప్రకారం మహారాష్ట్రలోనే ఈ బ్లడ్‌గ్రూప్ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
మరి బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని కనిపెట్టలేమా..? అంటే చేయవచ్చు. అందుకు హ్ యాంటీ జెన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాంటీ జెన్ రక్తంలో ఉంటే అది బాంబే బ్లడ్ గ్రూప్ అవుతుంది. ఇందులోనూ పాజిటివ్, నెగెటివ్ అని మళ్లీ రెండు రకాలు ఉంటాయి. పాజిటివ్ చాలా అరుదు అనుకుంటే నెగెటివ్ ఇంకా అరుదుగా ఉంటుంది. కొన్ని కోట్ల మందిలో బాంబే బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్న వారు ఒక్కరు ఉంటారు. ఇక ఇదే బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్న వారు 10వేల మందిలో ఒక్కరుంటారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z