Politics

తెలంగాణాకు నూతన రాష్ట్ర చిహ్నం-NewsRoundup-May 27 2024

తెలంగాణాకు నూతన రాష్ట్ర చిహ్నం-NewsRoundup-May 27 2024

* తెలంగాణలోని ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 49 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, భారాస అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్‌ ప్రధానంగా బరిలో నిలిచారు.

* ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకు ప్రత్యేకంగా చూస్తోందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. వివాదాల్లో ఉన్న వ్యక్తిని సీఎస్‌గా ఎందుకు కొనసాగిస్తోందో అర్థం కావడం లేదన్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో మరణాలు చోటు చేసుకున్నప్పుడే ఆయన్ని తొలగించాల్సిందన్నారు.

* లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహం గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో లభ్యమైంది. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్‌ యాప్‌లో రూ.10వేల రుణ తీసుకున్నాడు.

* ‘‘ఎంపీ ప్రజ్వల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి అతడిని భారత్‌కు రప్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఎంఈఏను అభ్యర్థించింది. కానీ పాస్‌పోర్ట్‌ను 24గంటల్లో రద్దు చేయడం సాధ్యం కాదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. రాష్ట్ర హోం మంత్రికి అసలు ప్రోటోకాల్ తెలుసా లేదా?’’అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు.

* ప్రస్తుతం గంభీర్‌ కోల్‌కతా మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు లఖ్‌నవూ జట్టుకు ఇదే బాధ్యతలు నిర్వర్తించాడు. అతడిని మళ్లీ కేకేఆర్‌కు తీసుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుక్ ఖాన్ చాలా శ్రమించాడని.. దాని కోసం గంభీర్‌కు ‘బ్లాంక్ చెక్‌’ ఆఫర్ చేశాడని తెలుస్తోంది. తన జట్టుతో పదేళ్లపాటు ఉండాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

* ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసు విచారణ సందర్భంగా నేడు హజారీ కోర్టులో హైడ్రామా నడిచింది. ఒక దశలో మహిళా ఎంపీ కోర్టులో కన్నీరు పెట్టుకొన్నారు. అంతేకాదు.. ఓ యూట్యూబర్‌ కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు.

* మరికొన్ని రోజుల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ దంపతులు కీలక విషయాలు వెల్లడించారు. ఇద్దరి అభిరుచులకు సంబంధించి అనేకమంది అడిగే ప్రశ్నలను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు.

* రామానంద్‌ సాగర్‌ రూపొందించిన‌ ‘రామాయణ్‌’ (Ramayan) సీరియల్‌లో సీతగా నటించి, ప్రేక్షకులను విశేషంగా అలరించిన నటి దీపికా చిఖ్లియా (Dipika Chikhlia). తనకెంతో గుర్తింపు తీసుకొచ్చిన ఆ పాత్ర అవకాశం ఎలా దక్కిందో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రామ్‌ తేరీ గంగా మైలీ’ (Ram Teri Ganga Maili) సినిమాలో నటించకపోవడం వల్లే సీతగా నటించే సదవకాశం తనకు దక్కిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే.. ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పైరవీ చేసి భాజపా ఎల్పీ పదవి తెచ్చుకున్నానని చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇది కాంగ్రెస్ కాదు. అందరి సమన్వయంతో నాకు భాజపాఎల్పీ నేతగా అవకాశం కల్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మీరు పీసీసీ పదవి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా..? మీలా దిగజారి ఆరోపణలు చేయలేను. మా అధ్యక్షుడి అనుమతితోనే సీఎంను కలవడానికి వెళ్లాను. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్.. యూ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం అవుతోంది. పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

* ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌, ఆయన బంధువుల అండతో సీఎస్‌ జవహర్‌రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారు. భోగాపురం మండలంలో సీఎస్‌ రూ.2వేల కోట్ల స్కామ్‌ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్‌ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ లేదా?ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవీ?ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సీఈవో స్పందించనందున జవహర్‌రెడ్డి అక్రమాలపై దిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. సీఎస్‌ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలి. అవసరమైతే హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరపాలి. డీ పట్టాలన్నీ సీజ్‌ చేసి అధికారులందరిపైనా విచారణ జరపాలి. ఆరోపణలు చేసిన వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. సీఎస్‌, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడీకి పాల్పడ్డారు. నిజాలు వెలికితీసిన వ్యక్తులను సీఎస్‌ బెదిరిస్తున్నారు. జవహర్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బొండా ఉమా డిమాండ్‌ చేశారు.

* తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా.. వాటిలో ఒకటి సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్‌, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్నే.. జూన్‌ 2న ఆవిష్కరించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z