NRI-NRT

అక్రమ వలసదారులకు మలేషియా క్షమాభిక్ష

Malaysia Announces Amnesty To Illegal Immigrants-Telangana Association To Help Telugus

ఆగష్టు 1 నుండి డిసెంబర్ 31 వరకు మలేషియా ప్రభుత్వం బ్యాక్ ఫర్ గుడ్ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది. ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం బ్యాక్ ఫర్ గుడ్ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది . ఆగష్టు 1 నుండి డిసెంబర్ 31 లోగా జైలు శిక్షలు లేకుండా వారి స్వదేశాలకు వెళ్లవచ్చని హోమ్ మినిస్టర్ తాన్ శ్రీ ముహయ్యిదీన్ తెలిపారు. ఈ క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు , వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళినట్లయితే వారు సాధారణ నియమ నిబంధనల అనుగుణంగా వ్యవహరిస్తే వారు మళ్ళి మలేషియా రావడానికి అనుమతించబడుతారు ఈ ఆమ్నెస్టీ ద్వారా తమ స్వదేశాలకు వెళ్లే వారు 700 రింగ్గిట్ మలేషియా (ఇండియన్ కరెన్సి లో రూ 12000) చెలించాల్సివుంది . అలాగే వారు పాసుపోర్టు, పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ మరియు సొంతంగా వారం రోజుల్లో వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదయినా సహాయం కావలిసినవారు మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను వాట్సాప్ +601118636423, ఈమెయిల్ info@myta.com.my లేదా ఫేస్బుక్ ద్వారా సంప్రదించాలని ప్రెసిడెంట్ సైదం తిరుపతి గారు కోరారు అలాగే ఈ ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ మరియు ఆంధ్రా ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.