ScienceAndTech

మళ్లీ టైటానిక్ సాహసయాత్ర-NewsRoundup-May 28 2024

మళ్లీ టైటానిక్ సాహసయాత్ర-NewsRoundup-May 28 2024

* అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఫోన్‌ ట్యాపింగ్‌పై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘‘అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయం అయ్యాయి. ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ట్యాపింగ్‌ అంశం బయటకు వచ్చింది. హార్డ్‌డిస్క్‌లు, డేటా బ్యాకప్‌ ఎక్కుడుందో అధికారులే తేల్చాలి. డేటా ఉందో, లేదో.. ఎలా మాయం చేశారో అంతా విచారణలో తేలుతుంది. మా ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయదు. రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావులేదు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు. అవి గుర్తుకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుంది. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి అప్పగించాం.

* విమానంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అత్యవసర ద్వారాన్ని తెరవడం, సిబ్బందిని గాయపరచడం వంటివి తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతేకాకుండా సిబ్బందిని కిందకు తోసేసి గందరగోళం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్‌ ఆస్ట్రేలియా (Virgin Australia flight) విమానంలో చోటుచేసుకొంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు VA696 విమానం సోమవారం రాత్రి బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని కింద పడేశాడు. అతడి చర్యకు తోటి ప్రయాణికులు హడలెత్తారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.

* ‘పుష్ప’తో అన్ని భాషల వారికి చేరువయ్యారు మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD) రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీని వల్ల దేని మీదా ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి తనలో గమనించినట్లు తెలిపారు. ఇది పిల్లల్లో సాధారణమని పెద్దలకు అరుదుగా వస్తుందన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన (Fahadh Faasil) తన సమస్యకు చికిత్స గురించి డాక్టర్‌ను అడిగారు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.

* ఉదయం పెందలాడే నిద్ర లేవటం, రాత్రి పెందలాడే పడుకోవటం ఎంతో మంచిదని డాక్టర్లు తరచూ చెబుతున్నదే. ఇది భోజనానికీ వర్తిస్తున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యయనం పేర్కొంటోంది. ఉదయం 8 గంటలకు తొలి భోజనం(అల్పాహారం)తో ఆరంభించి రాత్రి 8 గంటలకు చివరి భోజనంతో తిండి తినటాన్ని ముగిస్తే గుండె, రక్తనాళాలకు మేలు చేస్తున్నట్టు బయటపడింది మరి. రోజులో తొలి భోజనం ఆలస్యమవుతున్నకొద్దీ.. ప్రతి గంటకూ 6% చొప్పున గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు- ఉదయం 8 గంటలకు అల్పాహారం చేసేవారితో పోలిస్తే ఉదయం 9 గంటలకు టిఫిన్‌ తినేవారికి 6% ఎక్కువగా గుండెజబ్బు వచ్చే అవకాశం ఉంటోందని తేల్చారు. ఇక రాత్రి 8 గంటలకు ముందే చివరి భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి గుండెజబ్బు ముప్పు 28% ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. కాబట్టి ఆహారం విషయంలో అంతా జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కొక్కరి ఆహార అవసరాలు ఒక్కోలా ఉన్నప్పటికీ వేళకు తినటం, భోజనానికీ భోజనానికీ మధ్య తగినంత విరామం ఉండేలా చూసుకోవటం, పడుకునే ముందు మరీ ఎక్కువగా తినకపోవటం మంచిదని చెబుతున్నారు.

* ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగరావు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘భారాసకు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్‌ చేశాం. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్‌ చేశాం. భాజపా, కాంగ్రెస్‌లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్‌ చేశాం. భారాసలో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్‌ చేశాం. ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌ సహకారంతో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశాం. విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేశాం’’ అని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.

* టానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్‌ (Titan Submarine) మినీ జలాంతర్గామి విషాదాంతం సంగతి తెలిసిందే. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో ఇద్దరు వ్యక్తులతో మరో యాత్రకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలోని ఒహాయోకు చెందిన రియల్‌ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్‌.. ఈ సాహస యాత్రను సురక్షితంగా పూర్తిచేయొచ్చని నిరూపించాలనుకుంటున్నారు. ఈసారి ట్రిటాన్ సబ్‌మెరైన్స్ (Triton Submarines) సహ వ్యవస్థాపకుడు పాట్రిక్‌ లాహేతో పాటు లారీ.. సముద్రంలో 12,400 అడుగుల లోతు వరకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు.

* సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలవడం ఖాయమని కేంద్రంలోని భాజపా పలుమార్లు ప్రచారం చేయడంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికిలో లేని ఆ పార్టీ అన్ని స్థానాలను ఎలా గెలుచుకోగలదు అని ఎద్దేవా చేశారు. అమృత్‌సర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఖర్గే.. మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు.

* తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, అదనపు ఎస్పీ భుజంగరావు ఆదేశాలతోనే తాను దాడులకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తిరుపతన్న పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ఆయన చెప్పిన వివరాలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన మూడు ఉపఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుపతన్న బృందం కీలకంగా పనిచేసింది. ‘‘భారాస పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నాం. కాంగ్రెస్‌, భాజపా పార్టీలకు డబ్బు చేరకుండా అడ్డుకట్ట వేశాం. దీని కోసం ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. POL-2023 పేరుతో ప్రత్యేక ఎన్నికల వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రణీత్‌ కుమార్‌ ఇచ్చిన సమాచారంతోనే 15 ఆపరేషన్లు, మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, భాజపా సానుభూతిపరుల డబ్బులను సీజ్‌ చేశాం.

* జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బిహార్‌ ముఖ్యమంత్రి మరోసారి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటారని రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రి నీతీష్‌కుమార్ (Nitish Kumar) తన పార్టీని, రాజకీయాల్లో వెనకబడిన తరగతులను కాపాడటానికి ఏదైనా చేయగలడు. ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోగలడు’’ అని పేర్కొన్నారు.

* ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. ‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘‘బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.

* దేశ రాజధాని ఢిల్లీలో మంత్రుల కొనుగోలుకు కుట్ర జరుగుతుందంటూ ఆప్‌ మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 29న తమ ఎదుట హాజరు కావాలని అతిషిని ఆదేశించింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై స్పందనలో భాగంగా కోార్టు ఈ విధంగా స్పందించింది. కాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత మంత్రి అతిషి ఆప్‌ర్టీని, ప్రభుత్వాన్ని ఢిల్లీలో సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీ ఆరోపణలు గుప్పించారు. ఆప్‌ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు వలగా వేస్తూ వారిని కొనేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండేందుకు పార్టీ మారాలని బీజేపీ తనకు ఆఫర్‌ చేసిందని అతిషి ఆరోపించారు. ‘బీజేపీ సన్నిహితుల ద్వారా నన్ను సంపద్రించింది. వారు నన్ను బీజేపీలో చేరమని అడిగారు. ఇది నా రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఒకవేళ నేను సానకటీ మారకపోతే, నెల రజుల లోపల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నన్ను అరెస్టు చేస్తుందని వారు బెదిరించారు’ అని పేర్కొంది.

* ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణం ఉండ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమ‌ర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ ఉండదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌​ ప్రెసిడెంట్‌ కౌంటర్‌ ఇచ్చారు. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ, చార్మినార్‌ రాచరీక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ అనేవి రాచ‌రిక‌పు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతి వైభ‌వానికి చిహ్నాలు అని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z