Politics

జేసీ దివాకర్‌రెడ్డి సంతకం ఫోర్జరీ-CrimeNews-May 29 2024

జేసీ దివాకర్‌రెడ్డి సంతకం ఫోర్జరీ-CrimeNews-May 29 2024

* నంద్యాల జిల్లా శ్రీశైల మల్లిఖార్జునుడి ఆలయం చెంత ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకోవడం కలకలం రేపుతుంది . కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మఠంగారి మహేష్‌ (26) అనే యువకుడు ఓ సత్రంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సత్రం సిబ్బంది తలుపులు తీయాలని కోరగా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో కిటికి నుంచి చూడగా యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు (Police) అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కొంతకాలంగా శ్రీశైలం ఉపాలయాల్లో ఆ యువకుడు పాల్గొన్నాడని సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే యువకుడి మృతికి ఇంకా వివరాలు తెలియరాలేదు.

* పీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను సంస్థ తారుమారు చేసి.. తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్-62లోని తన ఇంటిని జేసీ దివాకర్ రెడ్డి గతంలో సాహితి నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చారు. జేసీ దివాకర్‌రెడ్డితో 2020లో సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణతో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నారు. 2023 మే నెలతో గడువు ముగిసింది. అయితే, ఇల్లు ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా లక్ష్మీనారాయణ స్పందించలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. క్రమంలో తమకు లీజు గడువు ఇంకా ఉందంటూ లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సాత్విక్‌ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు జేసీకి సమన్లు జారీ చేసింది. సాహితీ ర్మాణ సంస్థ యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన జేసీ.. వాటిలో ఒప్పందం 2021 మే నెలగా మార్చినట్లు గుర్తించిన ఆయన.. సంతకం ఫోర్జరీ చేసి ఆ పత్రాలను తయారుచేసినట్లు ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* ప్రజాభవన్‌కు(Praja Bhavan) బాంబు బెదిరింపు కేసులో(Bomb threat case) నిందితుడిని(Accused arrested) పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన నిందితుడు శివరామకృష్ణ మద్యం సేవించి పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

* విజయవాడ నగరంలో మరోసారి గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. విధి నిర్వహణలో ఉన్న విజయవాడ గవర్నర్‌పేట డిపో-1కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సీహెచ్‌ ఎస్‌ రావుపై అల్లరి మూకలు దాడి చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరంగల్‌ నుంచి కార్గో వాహనం నడుపుతూ విజయవాడ వస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూడలి దాటాక దాడి జరిగింది. ఆర్టీసీ కార్గో వాహనాన్ని వెంబడించి, కారు అడ్డంపెట్టి డ్రైవర్‌పై రౌడీ మూకలు విచక్షణా రహితంగా దాడి చేశారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దాడిలో డ్రైవర్‌ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని తొలుత విద్యాధరపురంలోని ఆర్టీసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద గంజాయి బ్యాచ్‌ ఇటీవలే పలువురిపై దాడికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z