NRI-NRT

జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక నవల పోటీ విజేతలకు సన్మానం

జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక నవల పోటీ విజేతలకు సన్మానం

సిరికోన సాహితీ అకాడమీ ఆధ్వర్యంలో 2023 జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక నవల పోటీ విజేతలకు సన్మాన కార్యక్రమాన్ని అంతర్జాల వేదికగా నిర్వహించారు. పోటీల నిర్వాహకులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారదలు అతిథులకు స్వాగతం తెలిపారు. 2021 నుండి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ద్రవిడ విశ్వ విద్యాలయం పూర్వ ఉప కులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అధ్యక్షత వహించారు. ఆచార్య గంగిశెట్టి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకొని కళాకారుల జీవిత అనుభవాలను ప్రతిబింబించే రచనలకు ఆహ్వానం పలికామనీ, తాటిపాముల మృత్యుంజయుడు , డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మిలు రచనలను సమీక్షించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

విశిష్ట బహుమతి గ్రహీతలుగా, విశ్రాంత విద్యావేత్త, ప్రముఖ నవలా రచయిత శ్రీ పాణ్యం దత్త శర్మ “శ్రీ మద్రమారమణ” నవలకు, “హృదయ గానం – నేడే విడుదల” నవలా రచయత కోసూరి ఉమాభారతికి, ప్రత్యేక బహుమతికి ఎంపికైన “కచ్చపి నాదం” నవలా రచయిత డా.మంథా భానుమతిలను సిరికోన సాహితీ సంస్థ తరఫున ఎన్.సి.చక్రవర్తి ఈ కార్యక్రమంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజ మనోహర్ బాబు, లెనిన్ వేముల, జయదేవ్ మెట్టుపల్లి, సర్వ మంగళ గౌరీ, కృష్ణ పుట్టపర్తి, గోవర్ధనరావు నిడిగంటి, నిర్మల నిడమర్తి, అరవింద రావు, స్వాతి శ్రీపాద, అయ్యదేవర శ్రీలక్ష్మి, శంకర కుమార శర్మలు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z