వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రేవు”. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర వివరాలు తెలిపారు.
సముద్రతీర ప్రాంతంలో చేపలు పట్టడమే జీవనాధారంగా బతికే మత్స్యకారుల జీవితాల్లోని సంఘర్షణ చూపించే చిత్రమిది. చాలా సహజంగా సినిమా సాగుతుంది, మూవీలో ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టుల నేచురల్ పర్ ఫార్మెన్స్ చేశారు. అజయ్, వంశీ, హేమంత్, ఆంటోనీ తమ క్యారెక్టర్స్ ను అద్బుతంగా పోషించారు. దర్శకుడు హరినాథ్ పులి చిన్న వాడైనా ఎంతో క్లారిటీగా ఆకట్టుకునేలా సినిమాను రూపొందించాడని జర్నలిస్ట్ ప్రభు అన్నారు.
సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని రాంబాబు అన్నారు.
నిర్మాత డా॥ మురళీ గింజుపల్లి మాట్లాడుతూ – నేను యూఎస్ లో ఉంటాను. సినిమాలంటే ప్యాషన్. గత పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమకు దగ్గరగా ఉంటున్నాను. మా సంస్థ ద్వారా మొదట ఒక మంచి సినిమాతో అడుగుపెట్టాలని కోరుకున్నాను. రేవు సినిమా గురించి పర్వతనేని రాంబాబు చెప్పటం ఆయన నిర్ణయానికి ఓకే అనటం మాకు ఆ అవకాశం కల్పించిన ప్రభుకి థ్యాంక్స్ అన్నారు. రేవు సినిమా కాపీ చూశాను. మత్స్యకారుల జీవితాల్లోని ఒడిదొడుకులు, వారి జీవన విధానాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు దర్శకుడు హరి అని మురళీ తెలిపారు.
ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు
*** సాంకేతిక నిపుణులు:
డి ఓ పి – రేవంత్ సాగర్
నేపథ్య సంగీతం- వైశాక్ మురళీధరన్
పాట- జాన్ కె జోసెఫ్
ఎడిటర్ – శివ శర్వాని
కళ- బాషా
సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు,
నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి,
రచయిత దర్శకుడు – హరినాథ్ పులి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z