NRI-NRT

భారత కాన్సుల్ జనరల్‌తో నాట్స్ ప్రతినిధుల భేటీ

భారత కాన్సుల్ జనరల్‌తో నాట్స్ ప్రతినిధుల భేటీ

అట్లాంటాలోని భారత కాన్సులేట్ ప్రధానాధికారి రమేశ్‌బాబు లక్ష్మణన్‌తో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ప్రతినిధులు సమావేశమయ్యారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అట్లాంటా ప్రతినిధులు సురేశ్ పెద్ది తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాట్స్ హెల్ప్ లైన్, అమెరికాకు వచ్చే విద్యార్ధులకు అవగాహన శిబిరాలు, గృహహింస బాధితులకు చేయూత, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, స్థానిక సేవ కార్యక్రమాలు వంటివాటిపై చర్చించారు. రాయబార కార్యాలయంతో నాట్స్ సమన్వయం తెలుగు వారికి మరిన్ని సేవలందించేందుకు అవకాశం కల్పిస్తుందనే ఆశాభావాన్ని ఇరువర్గాల ప్రతినిధులు వెలిబుచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z