Politics

వైకాపా మాజీ ఎమెల్యేపై పోక్సో కేసు-CrimeNews-July 04 2024

వైకాపా మాజీ ఎమెల్యేపై పోక్సో కేసు-CrimeNews-July 04 2024

* మందు పార్టీ తర్వాత మిగిలిన మద్యం బాటిల్స్‌ను ఒక వ్యక్తి తీసుకెళ్లాడు. దీనిపై ఆగ్రహించిన స్నేహితుడు అతడ్ని హత్య చేశాడు. (Friend Kills Man) హత్య కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు ఫ్రెండ్‌ అయిన నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. గోవాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం అర్థరాత్రి కోర్టాలిమ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్థలంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుడ్ని 32 ఏళ్ల లియోనెల్ లోబోగా గుర్తించారు. హత్య కేసుపై దర్యాప్తు చేశారు. చివరకు అతడి స్నేహితుడైన 34 ఏళ్ల అలెక్స్ కౌటిన్హోను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* తండ్రి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి రక్తం ముడుగుల్లో పడి మరణించింది. (girl shot dead) బీహార్‌ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. రూపస్‌పూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న హరి ఓం కుమార్‌ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి రాకను గమనించిన నాలుగేళ్ల కూతురు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంట్లోకి వెళ్లిన కుమార్‌ బైక్‌ను పార్క్‌ చేశాడు. అతడు తెచ్చిన సరుకులను భార్య ఇంట్లోకి తీసుకెళ్లింది. కాగా, ఇంటి బయట ఉన్న నాలుగేళ్ల పాపపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధం విన్న చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటి బయటకు వచ్చారు. తమ కుమార్తె రక్తం మడుగుల్లో పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

* మియాపూర్‌లో యువతిపై జరిగిన అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ రవి గుప్తాను ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ లేఖ రాసింది. బాధితురాలికి ఉచితంగా మెరుగైన వైద్యపరీక్షలు అందించాలని.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

* వైకాపాకు చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు కర్నూలులోని నివాసంలో ఉండగా రెండో పట్టణ పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అనంతరం వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సుధాకర్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z