ScienceAndTech

భారత రైల్వేలో 10వేల నాన్‌-ఏసీ కోచ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు

భారత రైల్వేలో 10వేల నాన్‌-ఏసీ కోచ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు

సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సామాన్యులు ఎక్కువగా ఎంచుకునేది రైలు మార్గాన్నే. ఈ నేపథ్యంలో వారి కోసం కేంద్ర రైల్వేశాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేలకు పైగా నాన్‌- ఏసీ కోచ్‌లను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని భారత రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సాధారణ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వచ్చే రెండేళ్లలో నాన్‌- ఏసీ కోచ్‌లను 22 శాతం పెంచనుంది. రెండేళ్ల ప్రణాళికను ప్రకటనలో వివరించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 2,605 జనరల్ కోచ్‌లు, 1,470 నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లతో పాటు 323 సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్ (ఎస్‌ఎల్‌ఆర్) కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. కోచ్‌లతో పాటు అధిక సామర్థ్యం గల 32 పార్శిల్‌ వ్యాన్‌లు, 55 ప్యాంట్రీ కార్లను కూడా తయారు చేయనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z