Devotional

Telugu Horoscope – July 12 2024

Telugu Horoscope – July 12 2024

మేషం
సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రము పఠించడం మంచిది.

వృషభం
తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలున్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

మిథునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

కర్కాటకం
పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహం
మిశ్రమకాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

కన్య
మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మి ధ్యానం మంచినిస్తుంది.

తుల
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో వినయంగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్య స్తుతి మేలుచేస్తుంది.

వృశ్చికం
కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలుంటాయి. ధనలాభం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు
చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళితే మంచి జరుగుతుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

మకరం
ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు పొందడానికి శ్రీవెంకటేశ్వరస్వామి సందర్శించాలి.

కుంభం
చేపట్టేపనుల్లో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

మీనం
పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధనా శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z