Devotional

Telugu Horoscope – July 18 2024

Telugu Horoscope – July 18 2024

మేషం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

వృషభం
ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మిథునం
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం
సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం
అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.

కన్య
బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది.

తుల
చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

వృశ్చికం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

ధనుస్సు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఓర్పు,సహనం,పట్టుదల అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది.

మకరం
చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బందిపెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కుంభం
బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మీనం
తోటివారి సహకారంతో ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. చంద్ర ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z