Devotional

లక్ష్మణ్ ఝూలా మూసేశారు

Laxman Jhula Closed Permanently For Extensive Damages And Beyond Repairs

రిషికేష్వెళ్లే పర్యాటకులకు అదో ప్రత్యేక ఆకర్షణ….కొంతమంది ప్రత్యేకంగా దానిని చూడడానికే వెళ్తారనడంలో సందేహంలేదు. అదే తెహ్రీ జిల్లా తపోవన్గ్రామంలో గంగానదిపై కట్టిన ‘లక్ష్మణ్జూలా’ వంతెన. తొంభై ఏళ్ల క్రితం బ్రిటిష్పాలన కాలంలో ఈ వేలాడే వంతెనను నిర్మించారు. రామాయణంలో లక్ష్మణుడు గంగానదిని దాటిన చోట కట్టడంతో ఈ వంతెనను లక్ష్మణ్జులా అని పిలుస్తారు. స్థానికులకు ఉపయోగపడుతూ, టూరిస్టులను ఆకర్షిస్తూ గ్రామానికే ప్రత్యేకంగా నిలిచిన ఈ వంతెన ఇకపై మూతపడనుంది. తొంభై ఏళ్లలో తొలిసారిగా అధికారులు శుక్రవారం దీనిని మూసేశారు. రాకపోకలను నిషేధించారు.ఇన్ని రోజులు రిపేర్లతో నెట్టుకొచ్చిన ఈ బ్రిడ్జి ఇకపై ఎంతమాత్రమూ ఉపయోగకరం కాదని దీనిని పరిశీలించిన ఎక్స్పర్ట్కమిటీ తేల్చింది. వెంటనే బ్రిడ్జిని మూసేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది. ఈ బ్రిడ్జి రిపేర్ల స్థాయిని దాటిపోయిందని, ఇంకా కొనసాగిస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం ఈ వంతెనను తాత్కాలికంగా మూసేసింది. శాశ్వతంగా మూసేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. దీనికి బదులుగా దగ్గర్లోనే కట్టిన రామ్జూలా ను ఉపయోగించుకోవాలని సూచించింది.