Videos

ఇండియాలోని అమెరికన్ పౌరులకు ఆ దేశం హెచ్చరికలు

ఇండియాలోని అమెరికన్ పౌరులకు ఆ దేశం హెచ్చరికలు

భారత్‌లోని తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా కీలక సూచనలు చేసింది. మణిపుర్‌, జమ్మూ కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ రివైజ్డ్‌ ట్రావెల్‌ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. దేశంలో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని సూచించింది. అలాగే, తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతం, లేహ్‌ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ పర్యటించొద్దని కోరింది. అక్కడ ఉగ్రవాదం, అశాంతి నెలకొందని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z