Devotional

Horoscope in Telugu – July 26 2024

Horoscope in Telugu – July 26 2024

మేషం
శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ద్వాదశ చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

వృషభం
మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

మిథునం
అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్యనమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

కర్కాటకం
మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతం అవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

సింహం
మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

కన్య
కార్యసిద్ధి ఉంది. మంచి పనులు చేపడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.

తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా బాగుంటుంది.

వృశ్చికం
సంతోషకరమైన కాలం ఉంది. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. విందు,వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.శాంతంగా వ్యవహరించండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు
కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.

మకరం
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కుంభం
మీ మీ రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. గతం కంటే మంచి సమయం. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవనామస్మరణ ఉత్తమం.

మీనం
మనఃస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z