* ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. యాపిల్ (అప్ప్లె) కంపెనీ తన ఐఫోన్ (ఇఫొనె ప్రిచెస్ స్లషెద్) ధరలను తగ్గించింది. బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు యాపిల్ బదిలీ చేసింది. దీంతో ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. యాపిల్ తాజా నిర్ణయంతో ప్రో మోడల్ ధర రూ.5,100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేలు మేర తగ్గింది. దేశీయంగా తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలూ స్వల్పంగా తగ్గాయి.ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.2300 మేర తగ్గింది. తాజా ధరలను యాపిల్ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. సాధారణంగా యాపిల్ కొత్త మోడళ్లు లాంచ్ చేసినప్పుడు మాత్రమే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తూ ఉంటుంది. కానీ, యాపిల్ తొలిసారి ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలను తగ్గించడం గమనార్హం. బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15 శాతానికి తగ్గించడమే ఇందుకు కారణం. సాధారణంగా దేశీయంగా దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్లకు 20 శాతం కస్టమ్స్ డ్యూటీ, 2 శాతం సర్‌ఛార్జి (22 శాతం) వర్తిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. తాజాగా కస్టమ్స్ సుంకం తగ్గించాక బేసిక్ కస్టమ్ డ్యూటీ 15 శాతం, 1.5 శాతం సర్‌ఛార్జి కలిపి 16.5 శాతానికి చేరింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్ ప్రస్తుతం 13, 14, 15 బేసిక్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తుండగా.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను దిగుమతి చేస్తోంది. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ఆ మేర ధరలు తగ్గాయి. దేశీయంగా తయారైన ఫోన్లకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో తగ్గింపు స్వల్పంగానే ఉంది.
* యూనియన్ బడ్జెట్ ప్రారంభమైంప్పటి నుంచి వరుస నష్టాల్లో సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయంలో భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,292.92 పాయింట్ల భారీ లాభంతో 81,332.72 వద్ద, నిఫ్టీ 428.75 పాయింట్ల లాభంతో 24,834.85 వద్ద ముగిసింది. శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, సిప్లా, భారతి ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్, అశోక్ లేల్యాండ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓణ్ఘ్ఛ్), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే, ఫెడరల్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి.
* భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్‌లో యాపిల్ ఐఫోన్‌లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్‌లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. యాపిల్ భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్‌లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్‌లను తయారు చేస్తోంది. ఆ యూనిట్‌లోని పరికరాల్లో కొన్నింటిని అప్‌గ్రేడ్ చేసి ఐప్యాడ్‌లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.
* పిల్లలకు వచ్చే వ్యాధులను దూరం చేయడానికి.. వారి భవిష్యత్తకు మద్దతుగా నిలబడటానికి జీఎస్‌కే (ఘ్శ్ఖ్) ‘అబ్ ఇండియా బనేగా 7-స్టార్’ అనే కార్యక్రమం ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తోంది. అబ్ ఇండియా బనేగా 7-స్టార్ ద్వారా పోలియో, చికెన్‌పాక్స్, హెపటైటిస్ ఆ, హెపటైటిస్ బి, మెనింజైటిస్, మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా, న్యుమోనియా, ఇన్‌ఫ్లుఎంజా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, హైబి ఇన్‌ఫెక్షన్ వంటి 14 వ్యాధులకు వ్యతిరేఖంగా 7 టీకాలు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతామని జీఎస్‌కే వెల్లడించింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ 7 టీకాలను వేయాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఈఆఫ్) సిఫార్సు చేస్తోంది. పిల్లల మొదటి పుట్టిన రోజు నుంచి.. కొన్ని వ్యాధులను నివారించడానికి టీకాలు చాలా అవసరమని జీఎస్‌కే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ షాలినీ మీనన్ వెల్లడించారు. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని.. ఈ విషయాలను తల్లితండ్రులకు తెలియజేయడానికి ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
* గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ (శుందర్ ఫిచై) మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. భారత్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ (హొనొరర్య్ డొచ్తొరతె) అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ వీకే తివారీ, విద్యాసంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు ఆయనకు ‘ఆనరరీ డాక్టర్ ఆఫ్ సైన్స్’ను అందించారు. ఈ విషయాన్ని స్వయంగా సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘నా పూర్వ విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ (ఈఈట్ ఖరగ్పుర్) నుంచి గతవారం గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను డాక్టరేట్ పొందాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆశ పడేవారు. ఐఐటీలో నేను నేర్చుకున్న విద్య, సాంకేతికతే ఈ రోజు నన్ను గూగుల్ వరకు తీసుకొచ్చింది. టెక్నాలజీని మరింత ఎక్కువమందికి అందించే స్థాయికి చేర్చింది. ఆ విద్యాసంస్థలో నాకు సమయం గడిపే అవకాశం వచ్చినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటా’’ అని గూగుల్ సీఈఓ (ఘూగ్లె ఛేఓ శుందర్ ఫిచై) రాసుకొచ్చారు. సంబంధిత ఫొటోలను షేర్ చేశారు.
* ఏఐ ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌జీపీటీ (ఛత్ఘ్ఫ్ట్) మాతృ సంస్థ ఓపెన్ ఏఐ (ఓఫెనాఈ) కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా ‘సెర్చ్‌జీపీటీ’ పేరుతో కొత్త సెర్చింజిన్‌ను ప్రకటించింది. ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్ డేటాను ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్ యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ప్రోటోటైప్ స్టేజ్‌లో ఉందని ఓపెన్ ఏఐ తెలిపింది. పరిమిత గ్రూప్, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని పేర్కొంది. సెర్చింజిన్ విషయంలో సుమారు 91 శాతం వాటా గూగుల్‌దే. సెర్చింజిన్‌ను తీసుకొస్తున్నట్లు ఓపెన్ ఏఐ (ఓఫెనాఈ) ప్రకటించడంతో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్లు 3 శాతం మేర కుంగడం గమనార్హం. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత ఈ సెర్చింజిన్ గూగుల్, బింగ్ వంటి సాధారణ సెర్చింజిన్ల మాదిరిగా కాకుండా.. కొంత సమాచారాన్ని ఇవ్వడంతో పాటు సంబంధిత లింక్‌లను కూడా జోడిస్తుంది. ఉదాహరణకు మ్యూజిక్ ఫెస్ట్‌లు గురించిన సమాచారం అడిగితే ఆ వివరాలను పొందుపరచడంతో పాటు ఆ కంటెంట్‌ను ఎక్కడి నుంచి అందిస్తున్నదీ సెర్చ్‌జీపీటీ తెలియజేస్తుంది. యూజర్లు అడిగే అనుబంధ ప్రశ్నలకూ సమాధానాలు ఇస్తుంది. సెర్చ్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలియజేయడం కోసం కంపెనీ తొలుత పబ్లిషర్లకు దీన్ని అందించనుంది.
* ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ 2024కి గానూ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ (టీంఏ వొర్ల్డ్స్ ఘ్రేతెస్త్ ఫ్లచెస్) జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అసాధారణ సంస్థలను ఇందులో పొందుపర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో రెండు భారతీయ గమ్యస్థానాలు కూడా ఉండడం విశేషం. అది 1.హైదరాబాద్‌లోని మనం చాక్లెట్, 2. హిమాచల్ ప్రదేశ్‌లోని నార్.. టైమ్ మ్యాగజైన్ గుర్తించిన రెండు భారతీయ ప్రదేశాలు. ఈ రెండూ వివిధ మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నాయని టైమ్ పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z