* వయనాడ్ (వయనద్)లో సహాయక చర్యలు ముందుకుసాగే కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కూడా దెబ్బతినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. ముండకై (ంఉందక్కై) ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. ఇక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా ముండకైలోనే నివాసం ఉంటున్నారు. తాజాగా కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ మాట్లాడతూ ‘‘మా కార్మికులతో ఇప్పటి వరకు సంప్రదించలేకపోయాం. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడంలేదు’’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
* కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల పట్ల వైకాపా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి చేరుకున్నారు. ఈ క్రమంలో జగన్ భద్రత కోసం వచ్చిన గన్నవరం ఎస్‌ఐను వైకాపా కార్యకర్తలు తోసేశారు. ఆయన భుజంపై చేయి వేసి గొడవకు దిగారు. దాడికి దిగిన వ్యక్తులను గన్నవరం పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. వారు తప్పించుకొని జగన్ కాన్వాయ్ వెంట వేరే కారులో పరారయ్యారు.
* ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (టెలెగ్రం) వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ (ఛేఓ ఫవెల్ డురొవ్) సంచలన ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్‌గా తాను తండ్రినని వెల్లడించారు. ఈమేరకు తన టెలిగ్రామ్ ఛానల్‌లో తాజాగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘‘నాకు 100 మందికి పైగా సంతానం ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఇదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా? 15 ఏళ్ల కిందట నా స్నేహితుడొకడు నన్ను కలిసి వింత సాయం కోరాడు. నా మిత్రుడికి, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం నన్ను వీర్యదానం చేయమని అడిగాడు. అది విని నేను విపరీతంగా నవ్వుకున్నా. కానీ, ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఆ తర్వాతే అర్థమైంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం (శ్పెర్మ్ డొనతిఒన్) చేసేవారు చాలా తక్కువమంది ఉన్నారని ఓ డాక్టర్ వివరించారు. వీర్యాన్ని దానం చేసి సంతానం లేని దంపతులకు సాయం చేయడం సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ఆ తర్వాత నేను స్పెర్మ్ డొనేషన్‌లో రిజిస్టర్ చేసుకున్నా. అలా ఇప్పటివరకు 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించా. చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని నేను ఆపినప్పటికీ.. ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా’’
* భారత సైన్యంలో (ఈందీన్ ఆర్మ్య్) రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం (శుప్రెమె ఛౌర్త్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ప్రకారం పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్లతరబడి జాప్యం చేస్తోందని మండిపడింది. ఈ క్రమంలో కేంద్రానికి రూ.2 లక్షల జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.
* పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మను బాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ద్వయం (లీ-యెజిన్) 10 పాయింట్లు సాధించింది. మను ఇప్పటికే వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు.
* గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి భారాసలో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆయన భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తాజా ఘటనతో భారాస శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
* బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదన్నారు. బడ్జెట్‌పై లోక్‌సభలో సమాధానమిచ్చిన ఆమె.. రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొవిడ్ మహమ్మారి అనంతర ప్రభావాలను అధిగమించామని చెప్పారు.
* ఏపీలో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పార్వతికి జేడీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. టీచర్ల బదిలీల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ రామలింగంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
* స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంగళవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. ఈ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన దిశగా సర్కారు ముందడుగు వేసిందని మంత్రి అన్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక ప్రణాళికల వ్యూహాత్మక పెట్టుబడిగా శ్రీధర్‌బాబు అభివర్ణించారు.
* అల్లు అర్జున్ (ఆల్లు ఆర్జున్) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’ (ఫుష్ప2: ఠె ౠలె). రష్మిక (ఋఅష్మిక) కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప.. పుష్ప..’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘పుష్ప’ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.
* వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును క్వాష్ చేయాలని పవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసుల్ని ప్రభుత్వం రివిజన్ చేస్తోందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని కేసు విచారణపై స్టే విధిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.
* ఐఏఎస్ కావాలని (ఊఫ్శ్ఛ్ ఆస్పిరంత్స్) చాలామంది కలలు కంటుంటారు. అందుకోసం కుటుంబాలను విడిచి దేశం నలుమూలల నుంచి లక్షల మంది దేశ రాజధాని దిల్లీ (డెళి)కి వచ్చి లక్ష్య చేధన కోసం శ్రమిస్తుంటారు. ఇదే అదునుగా భావించి కొందరు తమ ఇంటి అద్దెను విపరీతంగా పెంచేస్తున్నారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి గదికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 10 అడుగుల పొడవు, వెడల్పు కలిగిన గదిలో ఓ విద్యార్థి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఒక టేబుల్, కొన్ని పుస్తకాలు, ఒక కుర్చీ, నడవడానికి కాస్త స్థలం మాత్రమే ఉంది. లోపల ఒకరు ఉంటే మరొకరు కాసేపు ఉండేందుకు చోటు కూడా లేని పరిస్థితి. దుస్తులను కూడా లోపలే ఆరబెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ ఇరుకుగదికి యజమానులు రూ.12 నుంచి రూ.15 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఏటా అద్దె పెరుగుతూనే ఉంటుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి చోట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z