* కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్ సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్ కృష్ణ (ప్రధాన నిందితుడి) కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ ఎన్.రాజేందర్ తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర షాక్‌కు గురైన బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
* నగరశివారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో ఓ మహిళ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. పద్మ అనే మహిళ తన ఇంటి ఆవరణలో దుస్తులు ఉతికి ఆరేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బుల్లెట్ దూసుకొచ్చి కాలును గాయపరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. ఇలాంటి ఘటన జరగడం ఈ నెలలో ఇది రెండోసారి అని బాధితులు ఆరోపించారు.
* వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇంటి యజమానికి రెండు కిడ్నీలు చెడిపోయాయి. కిడ్నీ మార్పిడి చేయించాలని కుటుంబసభ్యులను కోరుతున్నారు. ఇంతలో ఏం జరిగిందో.. ఆయన భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన దూస రాజేశం (54), లక్ష్మి (50) దంపతులు పెద్ద కుమారుడు, కుమార్తెకు వివాహాలు చేశారు. చిన్న కుమారుడు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. రాజేశం పవర్‌లూమ్స్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. కొద్ది రోజులుగా అతడి రెండు కిడ్నీలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. కిడ్నీ మార్పిడి చేయించాలని రాజేశం కోరగా.. కొంచెం సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం కొడుకు, కోడలు ఓ శుభకార్యానికి వెళ్లగా.. ఇంట్లో రాజేశం, లక్ష్మి ఇద్దరే ఉన్నారు. కుటుంబసభ్యులు వచ్చిచూసేసరికి ముఖంపై రాడ్డుతో కొట్టిన గాయంతో లక్ష్మి మృతి చెంది ఉండగా.. రాజేశం గదిలో ఉరేసుకుని మృతి చెందారు. వారిమధ్య ఏదైనా వాగ్వాదం జరిగి.. క్షణికావేశంలో ఈ ఘటనలు జరిగి ఉంటాయన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.
* రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి తన చిన్ననాటి స్నేహితుడు గౌతం రెడ్డి, మరో యువకుడు కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డి, బాధితురాలు ఇద్దరూ కలిసి ఓంకార్ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కు నిన్న సాయంత్రం వచ్చారు. ఆ రెస్టారెంట్‌లో ఉన్న బార్‌లో గౌతం రెడ్డి, ఆ యువతి కలిసి మద్యం సేవించి, హోటల్ గదిలోకి వెళ్లారు. మత్తులో ఉన్న యువతికి కాసేపటికి స్పృహ వచ్చింది. గౌతం రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్‌లో ఉండగా బాధితురాలు కేకలు వేసింది. హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఆమె ఉన్న గది వద్దకు వచ్చేసరికి గౌతం రెడ్డితో పాటు మరో యువకుడు పరారీ అయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న యువతి గురించి, ఐడీ ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం అందించారు. బాధితురాలికి స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గౌతం రెడ్డితో పాటు అతని స్నేహితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z