Kids

నార్సింగిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…దోషికి ఉరిశిక్ష-CrimeNews-July 31 2024

నార్సింగిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…దోషికి ఉరిశిక్ష-CrimeNews-July 31 2024

* నగరంలోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణ దండన విధించింది. 2018లో నార్సింగిలో చిన్నారిపై సెంట్రింగ్‌ కార్మికుడు దినేశ్‌ కుమార్‌ కిరాతకానికి ఒడిగట్టిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు 2021లో ఉరిశిక్ష విధించగా.. ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్‌ చేశాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని సమర్థించింది.

* మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడు నెలల గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. మహిళతో పాటు ఆమె గర్భంలోని ఏడు నెలల శిశువు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

* అన్నమయ్య జిల్లాలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె మండలం సీటీఎం రైల్వే స్టేషన్‌ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని కురబలకోట మండలం రామిగానిపల్లెకు చెందిన నవీన్‌(19)గా గుర్తించారు. అతడు తిరుపతిలో బీటెక్‌ చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణలోని నిర్మల్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్‌ సమీపంలో బస్సును ఆపి సీజ్‌ చేశారు. ఈ ఘటనపై ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి మాట్లాడారు. ‘‘బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. హరికృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించిన నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణ బాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశాం. చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్ధయ్య డ్రైవ్ చేశాడు. కృష్ణబాబు బాధితురాలిని రేప్ చేశాడు. సిద్ధయ్య అతడికి సహకరించాడు. బాధితురాలితో మాటలు కలిపి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 64 (1) భ్ణ్శ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. నిన్న యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితులను ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించాడు’’ అని వివరించారు.

* ఐదేళ్ల బాలుడు స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ తెచ్చాడు. ఒక విద్యార్థిపై కాల్పులు జరిపాడు. (భొయ్ షూత్స్ శ్తుదెంత్ ఈన్ శ్చూల్) దీంతో ఆ స్టూడెంట్‌ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ స్కూల్‌ వద్దకు చేరుకున్నారు. బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లాల్‌పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. బుధవారం స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ దాచి పాఠశాలకు వచ్చాడు. మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై ఆ గన్‌తో కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతడి చేతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై కాల్పులు జరిపిన బాలుడితో ఎలాంటి గొడవ జరుగలేదని ఆ విద్యార్థి చెప్పాడు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రైవేట్‌ స్కూల్‌ వద్దకు చేరుకున్నారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కాల్పులు జరిపిన బాలుడు, అతడి తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు. విద్యార్థుల బ్యాగులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్ని స్కూల్స్‌ను ఆదేశించారు.

* చెడు వ్యసనాలకు బానిసైన బాల్య స్నేహితులు కరడుగట్టిన నేరస్తులుగా మారారు. దేవాలయాలను టార్గెట్‌ చేస్తూ.. దొంగతనాలు చేస్తున్నారు. శ్రీనివాసుడికే శఠగోపం పెట్టాలనుకున్న నిందితులు.. పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసు వివరాలను మంగళవారం బాలానగర్‌ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. శామీర్‌పేట పరిధిలోని అలియాబాద్‌ రత్నాలయంలో ఈనెల 23న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి శ్రీనివాసుడికే శఠగోపం పెట్టారు. ఏకంగా 10 తులాల బంగారం, 13.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు 60 కిలోల పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్‌ ఏసీపీ రాములు నేతృత్వంలో శామీర్‌పేట సీఐ శ్రీనాథ్‌ ఆధ్వర్యంలో శామీర్‌పేట, సీసీఎస్‌, మేడ్చల్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడ్డారు. పాత నేరస్తుల జాబితాలను తిరగవేస్తూనే.. సీసీ టీవీలను పర్యవేక్షిస్తూ నేరస్తుల ఆట కట్టించారు. దాదాపు 400 సీసీ టీవీలను పరిశీలించి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. నేరస్తులపై ఇప్పటికే శామీర్‌పేట, మేడ్చల్‌, పేట్‌ బషీరాబాద్‌, జీనోమ్‌వ్యాలీ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 13 కేసుల్లో దాదాపు రూ.70 లక్షల సొత్తును నిందితులు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ సమావేశంలో ఏసీపీ రాములు, సీఐలు శ్రీనాథ్‌, నర్సింహారాజు, ఎస్‌ఐ మునింధర్‌, సిబ్బంది లాలు సింగ్‌, హరీశ్‌, పాలాక్ష, మహేశ్‌, రాజరత్నం, పెద్దయ్య పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z