NRI-NRT

విద్యార్థులకు తానా ఫౌండేషన్‌ ఉపకారవేతనాల పంపిణీ

TANA Foundation Goutam Amirneni Donates Scholarships To 50 Students

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేయూత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో శనివారం నాడు 50మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉపకారవేతనాలను పంపిణీ చేశారు. ₹7లక్షల విలువైన నగదును గౌతమ్‌ అమర్నేని కుటుంబ సభ్యులు తానాకు అందజేశారు. వీటిని రాహుల్ అమిర్నేని 50మంది విద్యార్థులకు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌతమ్‌ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేసే అవకాశం కల్పించిన తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ పోలవరపులకు ధన్యవాదాలు తెలిపారు.

తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ, తానా ఫౌండేషన్‌ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చేయూత ద్వారా అనేకమంది విద్యార్థులకు ఉపకారవేతనాల ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేకపోతున్న వారికి తమ వంతుగా సహాయం అందిస్తున్నామన్నారు. వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యసేవలను కూడా అందిస్తున్నట్లు శశికాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా ప్రతినిధులకు, దాతలకు, పడాల ట్రస్ట్‌ డైరెక్టర్‌ రవీంద్ర తంగిరాలకు శశికాంత్ ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z