NRI-NRT

పాలకులు మారినా ప్రగతి ఆగదు-న్యూజెర్సీ సభలో తెలంగాణా సీఎం రేవంత్

పాలకులు మారినా ప్రగతి ఆగదు-న్యూజెర్సీ సభలో తెలంగాణా సీఎం రేవంత్

కులీకుతుబ్‌షా నుండి రేవంత్‌రెడ్డి వరకు పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు ఎన్ని అధికారంలోకి వచ్చినా తెలంగాణా రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని, సిద్ధాంతపరంగా, రాజకీయపరంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డారని అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో స్థానిక ప్రవాస భారతీయ సమాజం-ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్‌లు (IOC) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

తెలంగాణాలో త్వరలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు అంశాలపై ప్రపంచశ్రేణి శిక్షణా తరగతులను, సదస్సులను ఏర్పాటు చేస్తామని, ఆనంద్ మహీంద్రాతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కు మణిహారం అయితే, రీజినల్ రింగ్ రోడ్డు వడ్డాణంగా భాసిల్లుతుందని రేవంత్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలని రేవంత్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, IOC తెలంగాణా విభాగ అధ్యక్షుడు గంగసాని రాజేశ్వర్ రెడ్డి, TPCC-USA-NRI సౌత్ సెంట్రల్ విభాగ సమన్వయకర్త పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి, IOC ప్రతినిధులు, స్థానిక ప్రవాసులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z