అమెరికా పర్యటనలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం నాడు ఫిలడెల్ఫియాలో శ్రీధర్‌బాబుతో పలువురు ప్రవాస వ్యాపారవేత్తలు భేటీ అయ్యారు. ఆసక్తి కలిగిన, ఆర్థిక స్థోమత కలిగిన ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అమెరికాలో ఉన్నారని, కానీ తెలంగాణాలో ఏయే రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులపరంగా, రాయితీలపరంగా ప్రవాసులకు వెసులుబాటు కల్పిస్తుందో తెలియజేసే విధివిధానాలను పక్కాగా రూపొందించాల్సిన అవసరం ఉందని వీరు ఐటీ మంత్రికి తెలిపారు. ఆయా విధివిధానాలను రూపొందిస్తే రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, పారిశ్రామికవేత్తల నమ్మకానికి ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని వీరు శ్రీధర్‌బాబు వద్ద వెలిబుచ్చారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో శృంగవరపు నిరంజన్, కోయా హరీష్, TSIIC CEO మధుసూధన్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z