అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. గుంటూరులోని ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. సంస్థ నిర్వాహకులు జిల్లెళ్లమూడి వెంకట్ ట్రైనింగ్ సెంటర్ వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఐటీ రంగంలో మరింత నైపుణ్యంతో కూడిన కోచింగ్ అందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z