NRI-NRT

హైదరాబాద్‌లో EducationUSA అవగాహన సదస్సు

హైదరాబాద్‌లో EducationUSA అవగాహన సదస్సు

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకొనే భారతీయ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచేందుకు అక్కడ విశ్వవిద్యాలయాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లను నిర్వహించనున్నాయి. ఆగస్టు 16వ తేదీ నుంచి 26వరకు వీటిని నిర్వహిస్తున్నట్లు అమెరికా రాయబార ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. అగ్రరాజ్యంలో ఉన్నత చదువుల కోసం అవసరమైన సమగ్ర సమాచారాన్ని తెలియజేసేందుకు ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ (EducationUSA) పేరుతో అమెరికా ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 16న హైదరాబాద్‌లో, 17న చెన్నైతోపాటు బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె, ముంబయి, దిల్లీ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెన్నైలోని కాన్సులేట్‌ జనరల్‌ వెల్లడించారు.

డిగ్రీ, పీజీ, డాక్టరేట్‌ ప్రొగ్రామ్‌లలో అడ్మిషన్‌ కోసం చూసే విద్యార్థుల కోసం అమెరికాకు చెందిన దాదాపు 80కిపైగా యూనివర్సిటీలు, కాలేజీల ప్రతినిధులు ఈ ఫెయిర్‌లలో అందుబాటులో ఉంటారని చెన్నై కాన్సులేట్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. వీటికి ప్రవేశం ఉచితమని, రిజిస్ట్రేషన్‌ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం, రిజిస్ట్రేషన్‌ కోసం https://bit.ly/EdUSAFair24Emb వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z