Devotional

Horoscope in Telugu – Aug 18 2024

Horoscope in Telugu – Aug 18 2024

మేషం
పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

వృషభం
శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం.

మిథునం
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.

కర్కాటకం
సమాజంలో గొప్ప పేరుప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి.

సింహం
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కన్య
కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్కరం.

తుల
అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. గణపతి ఆరాధన శుభకరం.

వృశ్చికం
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు
ప్రారంభించబోయే పనుల్లో శుభఫలితాలు సాధిస్తారు. సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మకరం
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని విషయంలో అశ్రద్ధ చేయకండి. శ్రీసూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

కుంభం
శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. మీ బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది..

మీనం
వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z