NRI-NRT

తెలుగు భాష భవితపై మలేషియాలో జొన్నవిత్తుల ప్రసంగం

తెలుగు భాష భవితపై మలేషియాలో జొన్నవిత్తుల ప్రసంగం

రాబోవు 25-50 సంవత్సరాలలో తెలుగు భాష ఎలా ఉండబోతుందో అన్న అంశంపై జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో చర్చా కార్యక్రమాన్ని మలేషియా తెలుగు ఫౌండేషన్(MTF) ఆధ్వర్యంలో మలేషియా కౌలాలంపూర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్, లో నిర్వహించారు.

ముఖ్య అతిధులుగా మెంబెర్ అఫ్ పార్లిమెంట్ సభ్యుడు గణపతిరావు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ విజయలక్ష్మి సుందర రాజన్ లు హజరయ్యారు. తెలుగు భాషను ఏలా కాపాడుకోవాలో, మలేషియాలోని పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి ఇప్పటి తల్లితండ్రులు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో అలాగే వారు తెలుగుపై ఆసక్తి పెరగడానికి ఎలాంటి నీతి కథలను బోధించాలో వివరించారు. మలేషియా తెలుగు ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ కాంతారావు అక్కునాయుడు, ఎంపీ గణపతిరావులు జొన్నవిత్తులని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా, తెలుగు ఇంటెలెక్చవల్ అసోసియేషన్ అఫ్ మలేషియా,ఫైడా ఇంటర్నేషనల్ అఫ్ మలేషియా,పిరమిడ్ అండ్ మెడిటేషన్ సొసైటీ అఫ్ మలేషియా ,మలేషియా తెలంగాణ అసోసియేషన్,తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z