Editorials

ఇందిరా గాంధీలా మమతను కూడా కాల్చాలని పోస్టు-CrimeNews-Aug 19 2024

ఇందిరా గాంధీలా మమతను కూడా కాల్చాలని పోస్టు-CrimeNews-Aug 19 2024

* కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహిళల భద్రతను దీదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)కి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా ఓ విద్యార్థి చేసిన పోస్ట్‌ ఇప్పుడు వివాదాస్పదంగా (Controversial Post) మారింది. బీకాం చదువుతున్న కీర్తిశర్మ అనే విద్యార్థి మమతా బెనర్జీకి హత్య బెదిరింపులు చేశాడు. ‘మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలి..(Shoot Mamata Banerjee like Indira Gandhi)’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టాడు. దీంతోపాటు హత్యాచారానికి గురైన వైద్యురాలి ఫొటోలను కూడా పోస్టు చేశాడు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. హత్యను, అల్లర్లను ప్రేరేపించడం, అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం తదితర నేరాల కింద కేసులు బుక్‌ చేసి అరెస్ట్‌ చేసినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు.

* పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన (Kolkata Doctor Rape and Murder) యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతీ హృదయాన్ని మెలిపెడుతోంది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె డైరీ (Diary)లో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. ‘‘మా అమ్మాయి బ్యాగులో ఎప్పుడూ పర్సనల్‌ డైరీ ఉంటుంది. దాన్ని మేం ఎప్పుడూ చదవలేదు. హాస్పిటల్‌కి వచ్చాక తను రోజూ మాతో అన్ని విషయాలు పంచుకుంటుంది. ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉంది. దానికి సంబంధించిన ఫొటో నా వద్ద ఉంది’’ అని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. అయితే, అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సీబీఐ (CBI) తమకు సూచించినట్లు తెలిపారు.

* మలయాళ చిత్రసీమలో (Mollywood) పనిచేసే మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. సినిమా పనులు మొదలుకాక ముందే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక మంది బాధితులు ఆరోపించినట్లు తాజా నివేదిక పేర్కొంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్‌ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటికీ అందులోని విషయాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఆ నివేదికలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్‌లో పనిచేసే మహిళా నటులపై వేధింపుల విషయాన్ని తాజా నివేదిక ఎత్తిచూపింది. కొంతమంది మత్తులో జోగుతూ బాధిత మహిళల రూమ్‌ తలుపు తట్టేవారని.. వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది. భయం కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది.

* 1999లో సుమారు 188మంది ప్రయాణిస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 814ను హైజాక్‌ చేశారు ఉగ్రవాదులు. ప్రయాణికులను దాదాపు 7రోజుల పాటు బందీలుగా ఉంచి… ప్రపంచ ఏవియేషన్‌ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సంఘటన ఆధారంగా రూపొందుతున్న సిరీస్‌ ‘ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌’ (IC 814 The Kandahar Hijack). అనుభవ్‌ సిన్హా దీన్ని రూపొందిస్తున్నారు. విజయ్‌ వర్మ, అరవింద్‌ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది.

* దేశవ్యాప్తంగా పసిపిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ, దిల్లీ, ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా విస్తరించినట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు చిన్నారులను ప్రత్యేక బృందం రక్షించినట్లు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z