* బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో ఆరోతరగతి విద్యార్థులు చేసిన ప్రయోగం వికటించి విషవాయువులు విడుదలయ్యాయి. దీంతో ల్యాబ్‌లో ఉన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరిగెత్తారు. మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు వారిని బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. సైన్స్ టీచర్ సుజాత.. క్లోరోఫిల్ యాసిడ్, నిమ్మ ఉప్పుతో ప్రయోగం చేసి విద్యార్థులకు చూపించారు. ఆమె బయటకు వెళ్లగానే ఆ మిశ్రమానికి కొందరు విద్యార్థులు కాఫీపొడి, ఉప్పు, పంచదార, శానిటైజర్ కలపడంతో ఒక్కసారిగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో ల్యాబ్‌లో ఉన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులకు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం పరీక్షలు చేసి చికిత్స అందించారు. షణ్ముఖ్ అనే విద్యార్థి మినహా మిగిలిన వారందర్నీ డిశ్చార్జి చేశారు. షణ్ముఖ్‌కు గుండె సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. బాధిత విద్యార్థులను జాయింట్ కలెక్టర్ సుబ్బారావు పరామర్శించారు. ఘటనపై ఏపీసీఎంవో అధికారులు ఆరా తీశారు.
* మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణె (Pune)లోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ (Helicopter Crash) కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులున్నట్లు పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. అదృష్టవశాత్తూ వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు.
* సాయుధ దుండగులు జ్యువెలరీ షాప్‌ను దోచుకున్నారు. (Jewellery Shop Loot) వారు జరిపిన కాల్పుల్లో షాపు యజమాని మరణించాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజస్థాన్‌లోని భివాడిలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 23న సాయంత్రం ఏడు గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఐదుగురు సాయుధులు కారులో కమలేష్ జ్యువెలర్స్ వద్దకు వచ్చారు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డును కర్రతో కొట్టి అతడి వద్ద ఉన్న గన్‌ను లాక్కొన్నారు. కాగా, నగల షాపులోకి ప్రవేశించిన దుండగులు 48 ఏళ్ల యజమాని జై సింగ్‌పై దాడి చేశారు. అతడి కుమారుడు వైభవ్, షోరూమ్ సిబ్బందిని కొట్టి బంధించారు. వెంట తెచ్చిన రెండు బ్యాగుల్లో లక్షల విలువైన బంగారం, వెండి నగలను దోచుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించగా జై సింగ్ సోదరుడు మధుసూదన్ బయటి నుంచి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో నగల షోరూమ్ లోపల ఒక బ్యాగ్‌ను వదిలేసిన దుండగులు మరో బ్యాగ్‌తో కారులో హర్యానా వైపు పారిపోయారు.
* సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను కిడ్నాప్ చేశాడు. డ్రగ్స్ ఇచ్చి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. (woman kidnapped and Raped) ఆ మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు గమనించారు. కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తి పరిచయమయ్యాడు. శుక్రవారం కర్కాలకు కారులో వచ్చిన అతడు ఆమెను కిడ్నాప్ చేశాడు. అటవీ ప్రాంతానికి ఆ మహిళను తీసుకెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ వ్యక్తికి బీర్ బాటిల్స్ ఇచ్చారు. కాగా, బీర్‌లో డ్రగ్స్ కలిపిన ఆ వ్యక్తి ఆ మహిళతో బలవంతంగా తాగించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళను ఆమె ఇంటి వద్ద కారులో దింపేందుకు ప్రయత్నించాడు. అయితే హిందూ కార్యకర్తలు ఆ కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న యువతి మత్తులో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
* నగరంలోని నారాయణగూడ సర్కిల్ పరిధిలో వాణిజ్య పన్నులశాఖ అధికారి (DCTO ) వసంతాఇందిర లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB Raid) అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. శుక్రవారం సాయంత్రం కార్యాలయంపై దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న డీసీటీవో (డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్) ను పట్టుకున్నారు. బాధితుడికి సంబంధించిన అకౌంట్ లావాదేవీల పరిశీలనకు గాను డీసీటీవో వసంత లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం వ్యూహం ప్రకారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. పట్టుకున్న సొమ్మును ఆమె నుంచి స్వాధీనం చేసుకుని, ఆమెపై అవినీతి కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z