WorldWonders

ఛార్జర్ కోసం మహిళ హత్య-CrimeNews-Aug 26 2024

ఛార్జర్ కోసం మహిళ హత్య-CrimeNews-Aug 26 2024

* సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ కోసం జరిగిన చిన్నపాటి గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. రెండు రోజుల క్రితం మేడ్చల్‌ పరిధిలోని దుండిగల్‌ తండాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తండా2లో శాంత (50) అనే మహిళ పాలు, కల్లు, మద్యం విక్రయిస్తూ జీవనం సాగించేది. శుక్రవారం దుకాణం పక్కనే ఆమె విగతజీవిగా పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఎవరో హత్య చేసినట్లు అనుమానించి, ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా రావుల కమల్‌ కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. తొలుత నిందితుడు మొబైల్‌ ఛార్జర్‌ కోసం శాంతతో గొడవ పడ్డాడు. ఆమె అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో వెనక్కి నెట్టేశాడు. ఆమె వీపుభాగంలో బలంగా గాయమైంది. కేకలు పెడుతోందని భయపడి ఆమెకు ఊపిరి ఆడకుండా ముక్కు మూసేయడంతో ప్రాణాలు కోల్పోయింది. నేరం అంగీకరించిన అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.

* మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్‌ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు చెందిన గాయత్రీ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు పేరిట తమ భూమిని కబ్జా చేశారని కొందరు ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాజేశ్వర్‌రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అందోళనకారుల ఘర్షణలను అడ్డుకున్నారు. అనంతరం ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

* బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో అరెస్టు అయిన క‌విత‌.. ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఇటీవ‌లే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికాగా, ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ క‌విత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. క‌విత త‌ర‌ఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించ‌నున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే న‌మ్మ‌కంతో బీఆర్ఎస్ నాయ‌క‌త్వం ఉంది. క‌విత మార్చిలో జైలుకు వెళ్ల‌గా.. జూలై 16న తొలిసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అప్పుడు కవితను ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు.

* దెయ్యాన్ని వదిలించేందుకు పాస్టర్‌, అతడి అనుచరులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా కొట్టారు. దీంతో అతడు చనిపోయాడు. (man beaten to death by pastor) ఆ వ్యక్తి కుటుంబం ఫిర్యాదుతో పాస్టర్‌, అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల శామ్యూల్ మాసిహ్ రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తమ ఇంట్లో ప్రార్థన నిర్వహించాలని పాస్టర్ జాకబ్ మాసిహ్‌ను శామ్యూల్ కుటుంబం కోరింది. కాగా, ఈ నెల 21న పాస్టర్ జాకబ్ తన అనుచరులతో కలిసి ఆ ఇంటికి వచ్చాడు. శామ్యూల్ శరీరంలోకి దెయ్యం ప్రవేశించిందని దానిని వదిలిస్తానని అతడి కుటుంబ సభ్యులతో చెప్పాడు. తన అనుచరులతో కలిసి శామ్యూల్‌ను దారుణంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

* తల్లిని కొడుతున్న తండ్రిని అడ్డుకునేందుకు మైనర్‌ కుమారుడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆగ్రహంతో ప్లాస్టిక్‌ పైప్‌తో తండ్రి తలపై కొట్టి చంపాడు. (Boy Kills Father for Thrashing Mother) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 10.58 గంటల సమయంలో రోహిణి ప్రాంతంలోని అమన్ విగర్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని చంపినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z