NRI-NRT

డెట్రాయిట్‌లో 2025 తానా మహాసభలు

డెట్రాయిట్‌లో 2025 తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వైవార్షిక మహాసభలు 2025 జులై మొదటివారంలో డెట్రాయిట్‌లో నిర్వహించనున్నారు. ఈ సభలకు ఛైర్మన్‌గా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్, సమన్వయకర్తగా చాపలమడుగు ఉదయకుమార్‌లు వ్యవహరిస్తారని కార్యవర్గ సమావేశంలో తీర్మానించి ఆమోదించారు.

మహాసభల నిర్వహించే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు కోనేరు శ్రీనివాస్ నేతృత్వంలో కొడాలి నరహరి, దాసరి శ్రీనివాస్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డెట్రాయిట్‌ను ఎంపిక చేశారు. డెట్రాయిట్‌లో 2005, 2015 సంవత్సరంలో తానా సభలు నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z