Devotional

Horoscope in Telugu – Aug 29 2024

Horoscope in Telugu – Aug 29 2024

మేషం
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

వృషభం
అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీసుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

మిథునం
ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ వాగ్వాదాలు చేయకండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మంచిది.

కర్కాటకం
శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు వస్తాయి.

సింహం
సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

కన్య
మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం అందుతుంది. ఎవరితోనూ గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

తుల
అనుకూల ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవారాధన శుభప్రదం.

ధనుస్సు
పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలు ఉన్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.

మకరం
ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శివాష్టకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

కుంభం
ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. చేయని తప్పునకు నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శ్రీలక్ష్మీ ఆరాధన శుభకరం.

మీనం
పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z