Business

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు ముగుస్తోంది-BusinessNews-Aug 29 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు ముగుస్తోంది-BusinessNews-Aug 29 2024

* ప్రముఖ క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో (Zepto) సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (Kaivalya Vohra) అరుదైన ఘనత సాధించాడు. హురూన్‌ బిలియనీర్ల జాబితా (Hurun India Rich List)లో చోటుదక్కించుకున్నాడు. దీంతో భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో పిన్న వయస్కుడిగా నిలిచాడు. రూ.3,600 కోట్లతో కైవల్య అగ్రస్థానంలో నిలవగా.. మరో సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల అదిత్‌ పాలిచా రెండో స్థానంలో ఉన్నారు.

* జియో యూజర్లకు రిలయన్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది దీపావళి నుంచి ఏఐ క్లౌడ్‌ స్టోరేజీ (Jio AI Cloud Storage) సేవలను ప్రారంభించనుంది. అంతేకాదు.. వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద జియో యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరేజీని అందించనుంది. ఈ మేరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani).. కంపెనీ ఏజీఎంలో దీనిపై కీలక ప్రకటన చేశారు.

* రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ (Bangladesh)లో బీభత్సం సృష్టించింది. అల్లర్ల కారణంగా దేశానికి ఎంతో నష్టం జరిగింది. ప్రస్తుతం బంగ్లా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక ప్రభుత్వం.. ఆర్థిక మద్దతు కోసం ప్రపంచ బ్యాంకు సాయం కోరినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. ఆర్థిక వేత్త, నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus)నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమకు ఆర్థిక మద్దతు అందించాలని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ఏడీబీలను సాయం కోరింది. 8 బిలియన్‌ డాలర్లను సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ దేశానికి 100 బిలియన్‌ డాలర్లకు పైగా విదేశీ అప్పు ఉంది. ఈ రుణాలు చెల్లించడానికి ఐఎంఎఎఫ్‌ నుంచి 300 బిలియన్‌ డాలర్లు, పునరావాస కార్యక్రమాలకు మరో 300 డాలర్లు కావాల్సి ఉంది.

* ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) పొడిగించిన మూడు నెలల గడువు 2024 సెప్టెంబర్‌ 14న ముగియనుంది. దీంతో ఆధార్‌ కార్డులో మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* రిలయన్స్‌ సంస్థ వాటాదారులకు తీపికబురు చెప్పింది. షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ వాటాలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్‌ 5వ తేదీన సమావేశం కానుంది బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇదే విషయాన్ని నేడు వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ కూడా ధ్రువీకరించారు. ‘‘సెబీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్‌ 5వ తేదీన బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను ఇచ్చే అంశాన్ని పరిశీలించి ఆమోదించనుంది’’ అని సదరు ఫైలింగ్‌లో ప్రస్తావించింది. గతంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2009, 2017లో 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేసింది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం జీవితకాల గరిష్ఠాల్లో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,158 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 349 పాయింట్లు ఎగబాకి 82,134 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, నెస్లే, యాక్సిస్‌ బ్యాంకు కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీంద్రా బ్యాంకు, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.మార్కెట్‌ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్‌ ప్రకటించారు. జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z