DailyDose

రంగారెడ్డి జిల్లాలో తండ్రిని హతమార్చిన కుమార్తెలు-CrimeNews-Aug 31 2024

రంగారెడ్డి జిల్లాలో తండ్రిని హతమార్చిన కుమార్తెలు-CrimeNews-Aug 31 2024

* గుడిమల్కాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో భారీ దోపిడీ చోటుచేసుకుంది. ఓ నగల దుకాణం యజమాని వద్ద నుంచి రూ.35 లక్షల నగదు ఉన్న డబ్బుల బ్యాగును దుండగులు ఎత్తుకెళ్లారు. తిబర్మల్‌ జ్యువెలర్స్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌ బంజారాహిల్స్‌లో దుకాణాన్ని మూసివేసి సిబ్బంది బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మధ్యలో రేతిబౌలి వద్ద ఆగాడు. అదే సమయంలో హెల్మెట్‌ ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడి వద్ద బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* ఉద్యోగ విరమణ సమయంలో లభించిన సొమ్ము ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని హత్య చేసిన కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదనపు పీపీ ఎం.గంగారెడ్డి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం పాత జిల్లెలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ(58)కు ఓ కుమారుడు, ఐదుగురు కుమార్తెలు. కుమారుడు తరుణ్‌ (24), నాలుగో కుమార్తె అంజలి (23), ఐదో కుమార్తె ప్రియాంక (19) తండ్రితో పాటే జిల్లెలగూడలోని సొంత ఇంట్లో ఉండేవారు. తరుణ్‌కు 2014లో ఎముకల సంబంధిత క్యాన్సర్‌ రావడంతో కుడి కాలు తీసేశారు. ఆస్తుల పంపకం విషయంలో అతను తరచూ తండ్రితో గొడవపడేవాడు. మేడిపల్లి కృష్ణ వాటర్‌ వర్క్స్‌ శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేసి 2018లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ సమయంలో వచ్చిన సొమ్ము ఇవ్వాల్సిందిగా తరుణ్‌ అంజలి, ప్రియాంకలు తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. సొమ్ము ఇవ్వడం ఇష్టంలేని ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి నందనవనంలో ఒంటరిగా ఉంటూ వచ్చారు. 2018 నవంబరు 4న ఓ శుభకార్యం నిమిత్తం జిల్లెలగూడకు వచ్చిన ఆయన అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సొమ్ము విషయమై మరోసారి తండ్రితో ఘర్షణకు దిగి దాడిచేశారు. దాడిలో ఆయన మరణించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం.సతీష్‌కుమార్‌ శుక్రవారం ముగ్గురికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.

* ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లయిన మహిళపై ఇంట్లోనే అత్యాచారం జరిగింది. భాదోహిలో 20 ఏళ్ల మహిళపై రాహుల్(28)అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం మహిళ భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ ముందుగా సదరు మహిళతో అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో డబ్బులు కూడా ఎరగా చూపాడని, ఆమె ప్రతిఘటించడంతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఇన్‌స్పెక్టర్ సచ్చిదానంద్ పాండే తెలిపారు.

* రైలులో ప్రయాణించిన ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. (elderly man assaulted in train) గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో అతడ్ని కొట్టారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ వృద్ధుడ్ని కొట్టిన వ్యక్తుల్లో కొందరిని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. జల్గావ్ జిల్లాకు చెందిన హాజీ అష్రఫ్ మున్యార్, కళ్యాణ్‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ఇటీవల ధులే ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాడు. నాసిక్ జిల్లాలోని ఇగత్‌పురి సమీపంలో పది మందికిపైగా ప్రయాణికులు తొలుత సీటు విషయంపై ఆ వృద్ధుడితో వాగ్వాదానికి దిగారు. సీసాల్లో గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతడ్ని వేధించారు. తాను తీసుకెళ్తున్నది మేక మాంసమేనని, గొడ్డు మాంసం కాదని ఆ వృద్ధుడు చెప్పినప్పటికీ వారు విడిచిపెట్టలేదు. అతడ్ని వేధించడంతోపాటు కొట్టారు.

* గొడ్డు మాంసం తిన్నాడన్న అనుమానంతో వలస వచ్చిన వ్యక్తిని గో సంరక్షక బృందం సభ్యులు కొట్టి చంపారు. (Migrant killed in Haryana) మృతుడ్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లిం వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాబీర్ మాలిక్, హర్యానాకు వలస వచ్చాడు. బంధారా గ్రామ సమీపంలోని ఒక గుడిసెలో నివసిస్తున్న అతడు వ్యర్థాలు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సేకరించి వాటిని అమ్ముకుని జీవిస్తున్నాడు. కాగా, సాబీర్ మాలిక్ గొడ్డు మాంసం తింటున్నాడని గో సంరక్షక బృందం సభ్యులు అనుమానించారు. ఆగస్ట్‌ 27న ప్లాస్టిక్‌ బాటిల్స్ కొనుగోలు పేరుతో ఒక షాప్‌ వద్దకు అతడ్ని పిలిపించారు. సాబీర్‌ మాలిక్‌ను అక్కడ కొట్టారు. కొంత మంది స్థానికులు జోక్యం చేసుకోవడంతో వారు అతడ్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ దారుణంగా కొట్టడంతో సాబీర్‌ మాలిక్‌ మరణించాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z