మేషం (మార్చి 21 – ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 – మే 20 మధ్య జన్మించిన వారు)
మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త ఆలోచనలను విజయవంతంగా అమలు చేస్తారు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు అనుకూలం. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన అంశాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. ఫర్నీచర్ కొనుగోలుకు అనుకూలం.
కర్కాటకం (జూన్ 22 – జూలై 23 మధ్య జన్మించిన వారు)
ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. శుభవార్త వింటారు. వాహన కొనుగోలుకు తగిన సమయం. మార్కెటింగ్, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.
సింహం (జూలై 24 – ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షాపింగ్ ఆనందం కలిగిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 – సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
గత కొంతకాలంగా ఉన్న స్తబ్దత తొలగిపోయి మనసు ఆహ్లాదంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. వ్యక్తిగత సౌకర్యాల గురించి ఆలోచిస్తారు. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 – అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
వీసా, పాస్‌పోర్ట్ వ్యవహారాలకు అనుకూలం. రాజకీయ రంగంలోని వారికి పలుకుబడి పెరుగుతుంది. లక్ష్య సాధనలు గత అనుభవం తోడ్పడుతుంది. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (అక్టోబరు 24 – నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సహకార సంఘాలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 – డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. పదిమందిలో మంచి పేరు తెచ్చుకుంటారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ప్రచురణలు, టెలివిజన్, ఉన్నత విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.
కుంభం (జనవరి 21 – ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వైద్యం, హార్డ్‌వేర్, వడ్డీ వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మ్యూచ్యువల్ ఫండ్‌లలో పెట్టుబడులకు అనుకూలం. మరమ్మతులకు ఖర్చు చేస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 – మార్చి 20 మధ్య జన్మించిన వారు)
జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలమైన రోజు. నలుగురిని కలుపుకుని మంచి పనులు ప్రారంభిస్తారు. వేడుకలు ఆనంద కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. గణపతిని ఆరాధించండి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z