Movies

వెబ్ సిరీస్‌లో భూమిక

Bhumika Chawla Returns With Web Series Along With Kalki - వెబ్ సిరీస్‌లో భూమిక

అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల డిజిటల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ వైపు కూడా ఆడియన్స్‌ దృష్టి సారిస్తున్నారు. కంటెంట్‌ ఉన్న వెబ్‌సిరీస్‌లను బాగా ఆదరిస్తున్నారు. అందుకే యాక్టర్స్‌ కూడా అటువైపు ఓ కన్నేశారు. ఆసక్తికరమైన పాత్రలకు అవకాశం వచ్చినప్పుడు వెబ్‌ ఇంట్లో వాలిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో తన పేరును కూడా రాయించుకున్నారు నటి భూమిక చావ్లా. ‘భ్రమ్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారామె. ఈ వెబ్‌ సిరీస్‌లో బాలీవుడ్‌ నటి కల్కి కోచ్లిన్‌ ప్రధాన పాత్రధారి. ఈ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. ఎక్కువ శాతం షూటింగ్‌ను సిమ్లాలో ప్లాన్‌ చేశారు. సంజయ్‌ సూరి, ఓంకార్‌ కపూర్, ఐజాజ్‌ ఖాన్‌ ఈ సిరీస్‌లో కీలక పాత్రధారులు.